Hero Nikhil.. ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ ( Nikhil) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హ్యాపీ డేస్ (Happy days) అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సినిమా ద్వారా సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత యువత, వీడు తేడా వంటి చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇకపోతే హ్యాపీడేస్ సినిమా కంటే ముందే 2003లో సంబరం , 2006లో హైదరాబాద్ నవాబ్స్ వంటి చిత్రాలలో చిన్న పాత్ర చేసిన ఈయన హ్యాపీడేస్ సినిమాతో వెలుగులోకి వచ్చారు.
కార్తికేయ-2తో కమర్షియల్ హీరోగా మారిన నిఖిల్..
అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నిఖిల్ స్వామిరారా, కార్తికేయ, వంటి చిత్రాలతో కమర్షియల్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక చివరిగా 2022 లో కార్తికేయ 2 ( Karthikeya -2) సినిమాతో హీరోగా మారిపోయి.. తన సినిమాతో అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించారు.
నిఖిల్ మూవీ కోసం రూ .70 కోట్ల బడ్జెట్..
అయితే ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై వంటి చిత్రాలు మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ హీరో పై ఒక నిర్మాణ సంస్థ ఏకంగా భారీ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిఖిల్ నటిస్తున్న ఒక సినిమా కోసం ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అంతేకాదు ఇప్పటికే రూ.30 కోట్లు ఖర్చు పెట్టారట. వరుసగా స్టార్ హీరోల చిత్రాలకే ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టాలంటేనే నిర్మాతలు వెనుకడుగు వేస్తూ ఉంటారు. అలాంటిది ఒక యంగ్ హీరోని నమ్మి ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టడం అంటే ఆషామాషీ కాదు. ఒకవేళ ఈ హీరో మార్కెట్ ఆ రేంజ్ లో ఉందా అంటే అదీ లేదు. పైగా ఒక్కో సినిమాకు రూ.20 కోట్లకు మించి ఈయన పారితోషకం తీసుకోవడం లేదు .అలాంటి ఈ హీరో పైన ఇంత బడ్జెట్ పెట్టడం అంటే నిర్మాతలు భారీ రిస్క్ చేస్తున్నారని చెప్పాలి.
రిస్క్ చేస్తున్న నిర్మాతలు..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , ఈ సినిమా పీరియాడిక్ డ్రామా కాన్సెప్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా..? ప్రత్యేకించి నిఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ రేంజ్ లో బడ్జెట్ అంటే అంత వెనక్కి వస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా హీరో నిఖిల్ పైన నిర్మాణ సంస్థ భారీ రిస్క్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు తెరపైకి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక నిఖిల్ విషయానికి వస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. మరి నిఖిల్ రాబోయే తదుపరి చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.