Vijay Thalapathy : తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి ( Vijay Thalapathy ) రీసెంట్ గా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ సినిమా తమిళ, హిందీ, కన్నడ భాషలతోపాటు ఓవర్సీస్లో భారీ కలెక్షన్లను రాబడుతున్నది.. వినాయక చవితి తర్వాత కలెక్షన్స్ భారీగా పెరిగాయని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లు గ్రాస్ ను రాబడుతుంది. ఒకవైపు కలెక్షన్స్ మోత మోగిస్తుంది. మరోవైపు ఐదు రోజులు అవుతున్న విమర్శలు ఆగడం లేదు. ఇక ఈ మూవీలో త్రిష ( Trisha ) గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఇలా చెయ్యడం ఏంటని ఇంకా ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. అసలు త్రిష ఎందుకు ఈ మూవీ చేసిందో చాలా మందికి తెలియదు.. దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ వెంకట్ ప్రభు ( Venkat Prabhu) దర్శకత్వంలో సినిమా తెరకేక్కింది. ఈ సినిమా మొత్తం కొత్తగా ఉండటమే కాదు విజయ్ ను ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఫ్యాన్స్ రివ్యూ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. అది చర్చనీయంశంగా మారింది.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన త్రిష ఎందుకు ఇలా ఇచ్చింది. ఏ హీరో సినిమాలో ఆమె గెస్ట్ రోల్ చేసిన దాఖలు లేవు. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. త్రిష ఎంట్రీకి ఒక కారణం ఉందని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
వీరిద్దరి కాంబోలో గతంలో చిల్లీ అనే మూవీ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమాలో ఓ పాటలోని స్టెప్స్ ను గోట్ మూవీలోని సాంగ్ లో రిపీట్ చేశారు. ఆ హుక్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ సాంగ్ ను, ఈ సాంగ్ ను దింపేశారు. అది వీరి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంది. ఇక పోతే ఈ మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి.
విజయ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. యువన్ శంకర్ రాజా (Yuvan Sankar Raja) సంగీతం అందించారు.. సినిమాకు ఈయన మ్యూజిక్ బ్యాక్ బోన్ అయ్యింది. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జయరామ్ (Jayaram), స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.