Viswam Movie : మ్యాచో స్టార్ గోపీచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో “విశ్వం” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ లో పెద్దగా అంచనాలు లేకపోయినా, టీజర్ తో మంచి బజ్ తీసుకొచ్చారు. పదేళ్లుగా ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్, అలాగే పదేళ్లుగా డిజాస్టర్లతో డీలా పడిపోయిన శ్రీనువైట్ల కాంబినేషన్లో విశ్వం తెరకెక్కుతుండగా, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఇద్దరికీ ఉందని చెప్పాలి. ఆ మధ్య రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలు పెంచేయగా త్వరలో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పైనే ఇప్పటివరకు క్లారిటీ లేదు. పెద్ద సినిమాలు ఆల్రెడీ పండగలకు లాంగ్ వీకెండ్స్ పై ఖర్చీఫ్ వేసాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటివారం లో సినిమా తీసుకొవాలని ప్లాన్ జరుగుతుంది.
నిర్మాతల్లో అసహనం.. చర్చలు సఫలమవుతాయా?
ఇదిలా ఉండగా విశ్వం సినిమాకి సంబంధించి నిర్మాతల్లో అసహనం మొదలైందని తెలుస్తుంది. అసలు విషయానికి వస్తే… గోపీచంద్ విశ్వం సినిమాని ముందు చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ లో వేణు దోణెపూడి నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ ఆ తర్వాత సినిమా బడ్జెట్ లెక్కలు అమాంతం పెరిగిపోవడంతో పీపుల్ మీడియం ప్రొడక్షన్ వారు కూడా నిర్మాణంలో భాగమయ్యారు. ఏది ఏమైనా సినిమా నిర్మాణం ఆల్మోస్ట్ ఫినిషింగ్ కి చేరుకుంది. అయితే ఇప్పుడు విశ్వం సినిమా బిజినెస్ పైనే చర్చ జరుగుతుంది. ఈ సినిమా బిజినెస్ విషయంలో మొదట చిత్ర నిర్మాత వేణు దోణెపూడి అసహనంగా ఉన్నారట. ఎందుకంటే విశ్వం సినిమా బిజినెస్ లో ‘నాన్ థియేటర్ రైట్స్’ పీపుల్ మీడియా వాళ్ళు ఉంచుకునేలాగా, థియేటర్ రైట్స్ మాత్రం పాత ప్రొడ్యూసర్స్ (చిత్రాలయం బ్యానర్స్ ) కి ఇచ్చేలాగా మాట్లాడారట.
కానీ చిత్రాలయం నిర్మాత ఒప్పుకోవడం లేదని సమాచారం. ఎందుకంటే ఈ రోజుల్లో థియేట్రికల్ రైట్స్ కంటే నాన్ థియేట్రికల్ రైట్స్ పైనే ఎక్కువ లాభం వస్తుండగా, అది వదులుకుంటే నిర్మాత సగం నష్టపోయినట్టే. పైగా గోపీచంద్ – శ్రీనువైట్ల ట్రాక్ రికార్డ్ తెలిసిందే. తన లాస్ట్ సినిమా భీమాకి కూడా కేవలం 13 కోట్ల లోపే బిజినెస్ అయింది. ఈ క్రమంలో విశ్వం సినిమాకి అసలు బిజినెస్ కూడా సరిగా జరగడం లేదు. మహా అయితే 10 నుండి 14 కోట్ల లోపే బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని సమాచారం. అందుకే నిర్మాతలు ఈ విషయంలో ఎటూ డిసైడ్ కానీ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక పీపుల్ మీడియా నిర్మాతలు రిలీజ్ చేస్తే ఓన్ రిలీజ్ గా ఫ్రీ గా రిలీజ్ చేయాల్సి వస్తుందని అన్నారట.. దానికైనా ఓకే అనే పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ లేడు. ఏది ఏమైనా ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చిత్రాలయం బ్యానర్ నిర్మాత వేణు నాన్ థియేట్రికల్ హక్కులు వదులుకుంటే మాత్రం, సినిమాకి అసలేమాత్రం లాభం రాదు. అందులో ఇద్దరు నిర్మాతలు 50 -50 మాట్లాడుకుంటే ఏమైనా పరిష్కారం ఉంటుందేమో చూడాలి. విశ్వం సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్ వేణు దోనేపూడి కలిసి నిర్మిస్తుండగా, బడ్జెట్ దాదాపు 50 కోట్లదాకా అవుతుందనని సమాచారం. ఇక కావ్య థాపర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.