Dulquer Salmaan : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ కు తగ్గట్లే ఉంటుందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో దుల్కర్ సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా విషయంలో దుల్కర్ అన్ హ్యాపిగా ఉన్నట్లు తెలుస్తుంది. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
‘లక్కీ భాస్కర్ ‘ దుల్కర్ సల్మాన్..
సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ బ్యానర్ పై సాయి సౌజన్య సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా….’శ్రీకర ప్రొడక్షన్స్’ సంస్థ సమర్పిస్తుంది. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. కానీ ఈ హీరో మాత్రమే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ అతనికి నచ్చలేదని అందుకే ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యినట్లు తెలుస్తుంది. గతంలో వచ్చిన సినిమా రిజల్ట్స్ విషయం పై అతనికి నిరాశ పరిచిన్నట్లు ఓ వార్త వినిపిస్తుంది. అందుకే సినిమా మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తుంది. దీనిపై అదికారక ప్రకటన రావాల్సి ఉంది.
అప్పుడు ధనుష్ సార్ అంతే..
వెంకీ అట్లూరి డైరెక్షన్ బాగోలేదని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. అతనికి ఇది రెండో సినిమా.. మొదట గా సార్ మూవీ చేశారు. సార్ మూవీ టైం లో కూడా ధనుష్ కి సినిమా నచ్చలేదు. ప్యాచ్ వర్క్ కి మొత్తం ధనుష్ డైరెక్షన్ చేసుకున్నాడు. దాదాపు 10 రోజులు పాటు ధనుషే డైరెక్షన్ చేసుకున్నాడు. ధనుష్ చెయ్యడం వల్లే సార్ మూవీ అంత పెద్ద హిట్ అయింది. అయినా, సితార వాళ్లు వెంకీ అట్లూరి విడిచిపెట్టడం లేదు. ఆయనకే సపొర్ట్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టినప్పుడు అవుట్ పుట్ సరిగ్గా రావడానికి ప్రయత్నించాలి. కానీ, సితార వాళ్లు అలా ఆలోచిండం లేదా..? సార్ సినిమాలో వెంకీ నుంచి జరిగిన మిస్టేక్స్ ఇప్పుడు మళ్లీ పునరవృతం అవుతుందటే… నిర్మాతలు సీరియస్ గా లేరా ? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీనిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రావాల్సి ఉంది..