Star Director : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు ఎంత కామన్ అన్న విషయం తెలిసిందే.. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు విడిపోవడం కామనే. ఇక ఎవరికీ నచ్చినట్లు వాళ్లు ఎఫైర్ లు పెట్టుకోవడం తమ పార్ట్నర్స్ విడాకులు ఇవ్వడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికే ఎంతో మంది ఇలా సంబంధాలను పెట్టుకొని కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా హీరోయిన్ తో సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డైరెక్టర్ పెద్దగా స్టార్ డైరెక్టర్ ఏమి కాదు.. ఈయన చేసింది తక్కువ సినిమాలే. కానీ మంచి ఇమేజ్ ను అందుకున్నాడు. అందులో అన్ని హిట్ కొట్టినవే.. అలా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ దర్శకుడు తన భార్యకి విడాకులు ఇచ్చేశారు. అయితే భార్యకి విడాకులు ఇచ్చిన సమయంలో ఎలాంటి గాసిప్స్,రూమర్లు మీడియాలో వినిపించలేదు. కానీ తాజాగా ఆ హీరోయిన్ కారణంగానే దర్శకుడు తన భార్యకు విడాకులు ఇచ్చేసారనే టాక్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. ఆయనతో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఎఫైర్ పెట్టుకుందనే టాక్ ఉంది. ఆ హీరోయిన్ మోజులో పడి ఆయన సినిమాలకు దూరం అయ్యాడని ఓ వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది.
ఇకపోతే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడకుండా చాలా రోజులు గుట్టుగా దాన్ని నడిపించేశారు. ఇక అప్పటికే పెళ్లయిన డైరెక్టర్ తన భార్యకు కారణం చెప్పకుండానే విడాకులు ఇచ్చేశారు. ఇక విడాకులు ఇచ్చాక ఇన్ని రోజులకి భార్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఆ హీరోయినేననీ, ఆ హీరోయిన్ తో ఎఫైర్ కారణంగానే స్టార్ డైరెక్టర్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఆ హీరోయిన్ కి,ఈ డైరెక్టర్ కి ఇండస్ట్రీలో అంత అవకాశాలు ఏమీ లేవు.. ఫ్యూచర్లో సినిమాలు ఏమైనా చేస్తారేమో చూడాలి. ఇక వీరి రిలేషన్ రహస్యంగానే కంటిన్యూ చేస్తారా లేక ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది..