Harish Shankar: హరీష్ మిస్టర్ బచ్చన్ చేసి తప్పు చేసాడా.? పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా.?

Harish Shankar: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. షాక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ రచయితగా కొన్ని సినిమాలు పనిచేశాడు హరీష్. మళ్లీ రవితేజ అవకాశం ఇవ్వడంతో మిరపకాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలబడిపోయాడు హరీష్. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా హరీష్ ను స్టార్ డైరెక్టర్ చేసేసింది.

ఇప్పటికీ చాలామందికి హరీష్ శంకర్ అంటే గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఒక రీమేక్ ఇలా కూడా చేయొచ్చు అని ఒక డెఫినిషన్ గబ్బర్ సింగ్ సినిమాతో క్రియేట్ చేశాడు హరీష్. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న జోష్ గబ్బర్ సింగ్ సినిమాలో బయటికి తీశాడు. ఆ సినిమాలోని డైలాగ్స్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కి సరిపడేటట్టు పర్ఫెక్ట్ గా రాశాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ తర్వాత హరీష్ శంకర్ ఇచ్చిన స్పీచ్ తో అందరికీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాము అని నమ్మకాలు వచ్చేశాయి.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా కావాలని ఫ్యాన్స్ ఎంతోమంది విపరీతంగా కోరుకున్నారు. ఎట్టకేలకు వీరిద్దరూ కలిసి భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక సినిమాను చేస్తారు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 15 రోజులు డేట్స్ ఇచ్చినా కూడా అద్భుతమైన కంటెంట్ లాగాడు హరీష్ శంకర్. చాలామంది ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన తర్వాత హరీష్ ను పొగడటం మొదలుపెట్టారు.

- Advertisement -

Ustaad Bhagat Singh

 

ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేసాడు. ఈ సినిమాకు ముందు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాపై విపరీతమైన ట్రోలింగ్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం హరీష్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఉస్తాద్ టీజర్స్ చూడగానే అందరికి మంచి ఇంప్రెషన్ వచ్చింది. వాళ్ళు అంతా కూడా మిస్టర్ బచ్చన్ సినిమా చూసి ఉస్తాద్ పరిస్థితి ఏంటో అనుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు