Devara.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో.. నందమూరి హీరో ఎన్టీఆర్ (NTR)తాజాగా నటిస్తున్న చిత్రం దేవర (Devara). ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న చిత్రం దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై హైప్ పెంచడానికి సినిమాకు సంబంధించిన పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా నుంచి చుట్టమల్లె పాట విడుదల చేయడానికి ముందు కూడా కొన్ని పోస్టర్లు చిత్ర బృందం విడుదల చేశారు.
కొరటాల శివ పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..
ఇకపోతే తాజాగా విడుదల చేసిన పోస్టర్లను అన్నింటిని మనం గమనించినట్లయితే, అన్నింటిలో కూడా ఒక కామన్ పాయింట్ మనం గమనించవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి హైట్ విషయంలో ఎన్టీఆర్ కంటే కూడా జాన్వీ కాస్త హైట్ ఎక్కువగానే ఉంటుంది. ఆ హైట్ ని కవర్ చేయడానికి జాన్వీ ని బెండ్ అయ్యేలా చూసుకున్నారు కొరటాల శివ. నిజానికి ప్రస్తుతం ఉన్న అత్యాధునిక ప్రపంచంలో ఏదైనా గ్రాఫిక్స్ వాడి హైట్ మేనేజ్ చేయవచ్చు. కానీ ఇలా దొరికిపోయేలా ఎందుకు చేశారంటూ అభిమానులు కొరటాల శివ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పాన్ ఇండియా స్టార్ హీరో అలాంటి ఆయనను పొట్టి వాడు అంటూ హేళన చేసేలా డైరెక్టర్ చూపించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నిజానికి ఎన్టీఆర్ తో చాలామంది హైట్ ఉన్న హీరోయిన్లు పలు సినిమాలలో నటించారు కానీ ఎక్కడా కూడా ఆయన పొట్టిగా ఉన్నట్లు డైరెక్టర్లు ప్రజెంట్ చేయలేదు. అయితే ఇప్పుడు కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ హైట్ ను రిప్రజెంట్ చేస్తూ జాన్వీ కపూర్ ను బెండ్ చేస్తూ ఎన్టీఆర్ పొట్టి అని మరొకసారి గుర్తు చేసేలా విడుదల చేసిన పోస్టర్లు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరి దీనిపై కొరటాల శివ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
దేవర సినిమా విశేషాలు..
ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగానే మొదట సెప్టెంబర్ 27న మొదటి భాగం విడుదల చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా పూర్తి చేసిన తర్వాతనే దేవర రెండవ భాగాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొకవైపు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమాతో ఇలా దొరికేసారు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.