Devara Trailer: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో దేవర సినిమా ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం తెలుగులో మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ప్రస్తుతం రాబోతున్న దేవర సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మొదటి డిజాస్టర్
దర్శకుడు కొరటాల శివ విషయానికొస్తే మిర్చి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు. సినిమా తర్వాత సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్లాడు. ఇండస్ట్రీలో సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చాలా ఈజీగా అర్థమయిపోతుంది. నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన తర్వాత ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు శివ. ఇక ఈ సినిమాతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పటివరకు కొరటాల శివ ను పొగిడిన చాలామంది మెగాస్టార్ చిరంజీవికి ఒక డిజాస్టర్ సినిమా ఇచ్చాడని తిట్టడం కూడా మొదలుపెట్టారు. మొత్తానికి దాని నుంచి బయటపడి దేవర సినిమాను చేస్తున్నాడు శివ.
రోజురోజుకు పెరుగుతున్న అంచనాలు
ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే డేట్ కి పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా వస్తుందని అందరూ ఊహించరు. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటం వలన వచ్చే సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దేవర సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి థర్డ్ సింగిల్ ని కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారు.
రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యే అవకాశం
ముఖ్యంగా ఈ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ట్రైలర్. ఇక రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. సెప్టెంబర్ 15న ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తే, సినిమా రిలీజ్ కి ఇంకా కేవలం 12 రోజులు ఉంటుంది. ఈలోపు ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేస్తే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. అనిరుద్ అందించిన రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సాధించాయి. అలానే అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఎంత బాగా అందిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తుంది అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అలానే రాజమౌళి సెంటిమెంట్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అనేది కొంతమంది అభిప్రాయం.