Devara: మెగా వర్సెస్ ఎన్టీఆర్.. నిప్పు రాజుకోనుందా..?

Devara : కొరటాల శివ (Koratala Shiva) డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా ఇటీవల నటించిన చిత్రం దేవర (Devara).. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇకపోతే సెప్టెంబర్ 27వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సెప్టెంబర్ 10న ముంబైలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరి ఎన్టీఆర్ ను ఇలా ప్రశ్నించారు.. కొరటాల శివ గత చిత్రం ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి ? అంటూ అడిగారు విలేకరి.

ఆచార్యను ఉద్దేశించి ఎన్టీఆర్ అలాంటి కామెంట్..

దీనికి ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం మెగా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. కొరటాల శివకు సరైన సమయం, సరైన వ్యక్తులు పక్కన ఉంటే కచ్చితంగా అద్భుతమైన సినిమా తీస్తాడు అంటూ ఎన్టీఆర్ చెప్పడంతో మెగా అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పై మాటల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా రకరకాల కామెంట్లు చేసుకుంటున్నారు అసలు విషయంలోకి వెళ్తే , చిరంజీవి ఆచార్య సినిమాలో వేలు పెట్టడమే అందుకే అప్పటి వరకు నాలుగు బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన కొరటాల శివ కూడా ఫ్లాప్ ఇవ్వాల్సి వచ్చిందని తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

దేవర ను ఆడనివ్వం – మెగా అభిమానులు

ఆచార్య సినిమా ముందు వరకు కూడా మంచి విజయాలను అందుకున్న కొరటాల శివ , ఆచార్య సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు. అందుకే సరైన వ్యక్తులు, సరైన సమయం అంటే చిరంజీవిని ఉద్దేశించే కదా ఎన్టీఆర్ మాట్లాడారు అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఇక దేవర సినిమా ఆడదని, ఫ్లాప్ అవుతుందని, రాజమౌళి సెంటిమెంట్ కచ్చితంగా పనిచేస్తుందని శాపనార్ధాలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు మెగా అభిమానులు.

- Advertisement -
Devara: Mega Vs NTR.. will fire reign..?
Devara: Mega Vs NTR.. will fire reign..?

మెగా ఫ్యాన్స్ వర్సెస్ తారక్ ఫ్యాన్స్..

మొత్తానికి అయితే తారక్ చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులకు ఒక ఆయుధం దొరికినట్లు అయింది. దీంతో ఈ సినిమాపై నెగెటివిటీని మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సాధ్యమైనంతవరకు సినిమాపై వ్యతిరేకత ప్రచారం చేసి ఫ్లాప్ అయ్యేలా చేస్తామంటూ చిరు అభిమానులు కామెంట్లు పెడుతుండడంతో వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఏదిఏమైనా ఎన్టీఆర్ చేసిన ఒక చిన్న కామెంట్ వల్ల ఇప్పుడు మెగా వెర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా మారిపోయింది. మరి దీనిపై అటు మెగా హీరోలు.. ఇటు ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

 

కక్ష్య సాధింపు చర్యలా..

ఇకపోతే ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలో కూడా ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారని , రామ్ చరణ్ కు ఎక్కువ స్క్రీన్ ఇచ్చారనే వార్తలు కూడా వినిపించాయి. దానికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కామెంట్ కూడా తోడయ్యాయి. మొత్తానికైతే మెగా అభిమానులు ఇప్పుడు అవకాశం వచ్చిందని ఎన్టీఆర్ పై రివేంజ్ తీర్చుకుంటున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో హీరోల అభిమానుల మధ్య ఎప్పుడు ఏ విషయంపై గొడవలు ఎలా తలెత్తుతాయో చెప్పలేని పరిస్థితిగా ప్రస్తుతం మారిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు