Devara : రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీతో చారిత్రాత్మక విజయం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర: పార్ట్ వన్‌తో తన ఫ్యాన్స్ ను అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన డేట్ లీక్ అయ్యింది. మరి మేకర్స్ ట్రైలర్ కు ముహూర్తం ఎప్పుడు ఖరారు చేశారో తెలుసుకుందాం పదండి.
దేవర టైలర్ లాంచ్ డేట్ ఇదే?
కోస్టల్ ఆంధ్ర నేపధ్యంలో రూపొందిన చిత్రం దేవరలో మొదటిసారిగా జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టింది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్లు నడుస్తున్నాయి. వరుసగా సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేస్తుండడంతో గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సందడే కన్పిస్తోంది. ఇప్పుడు దేవర విడుదలకు సరిగ్గా 23 రోజులు మిగిలి ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వాళ్ళ కోసమే అన్నట్టుగా తాజాగా దేవర ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం దేవర థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ట్రైలర్‌ను సెప్టెంబర్ 10 లేదా సెప్టెంబర్ 11న లాంచ్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికైతే మేకర్స్ ట్రైలర్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దేవర ట్రైలర్ లో డ్రామా, యాక్షన్ ఎక్కువగా ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్, జాన్వి కపూర్ తో సహ దేవర టీం అంతా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంటారని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
ప్రమోషన్స్ ప్లాన్ కూడా రివీల్
దేవర ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మార్కెటింగ్ బృందం ప్లాన్ చేస్తోంది అని ఇన్సైడ్ వర్గాల సమాచారం. RRR మాదిరిగానే, దేవర కూడా ప్రేక్షకులకు చేరువయ్యేలా గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసారని అంటున్నారు. అదే నిజమైతే భారతదేశం అంతటా దేవర టీం పర్యటించే అవకాశం ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన దావూది దావూది అనే సాంగ్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ అదిరిపోయే మాస్ బీట్ అని ఊరించినప్పటికీ సాంగ్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేదు. కనీసం ప్రమోషన్స్ తోనైనా దేవర టీం అందరి దృష్టిని ఆకర్షింస్తుందా అనేది చూడాలి.
కాగా దేవర రెండు భాగాలుగా రానుండగా, ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ వార్ 2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసిన తర్వాత దేవర తదుపరి భాగం షూటింగ్ ప్రారంభమవుతుంది.