Devara.. జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా భాషలలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతుండగా.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారు. ఇక ఇటీవల సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో రీల్స్ గా ట్రెండ్ అవుతున్నాయి.
రన్ టైం లాక్..
ఇటీవలే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి రన్ టైం తాజాగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ రన్ టైం చూసి అభిమానులలో ఆందోళనలు కలుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రన్ టైమ్ ఎంత? అసలు ఏం జరిగింది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం
ఆడియన్స్ ను మెప్పిస్తుందా..
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాకి 3 గంటల 10 నిమిషాల రన్ టైం తో ముగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇంత నిడివి అంటే కాస్త ఇబ్బందే అని చెప్పాలి. ఎందుకంటే ఇంత నిడివితో వచ్చిన భారతీయుడు 2, అంటే సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలు మూడు గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా నిలిచాయి. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ సినిమాను నడిపితే తప్ప.. కొంచెం అటు ఇటు అయినా సరే ఆడియన్స్ తిప్పి కొడతారు. అది ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పూర్తిస్థాయిలో కలవరపెడుతోంది.
సెప్టెంబర్ 27న ప్రీమియర్ షో..
దేవర సినిమాకి ఇంకా సెన్సార్ జరగలేదని , అది అయ్యాకే ఫైనల్ రన్ టైం లాక్ చేస్తారని చిత్ర బృందం చెబుతోంది. మరొకవైపు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో సెప్టెంబర్ 27వ తేదీన తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రీమియర్ షో కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ నిడివి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఎలాంటి మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.
మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్..
ఎన్టీఆర్ హీరో గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని జిల్లాలు వరదతో నీటిమయమైన నేపథ్యంలో ఆయన తన వంతు సహాయంగా ఒక్కో రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళాలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. అలా ఒక వైపు సినిమాలో, మరొకవైపు ఇలా సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు ఎన్టీఆర్. ఇక అందుకే ఎన్టీఆర్ కు రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పవచ్చు.