Deepika Padukone : సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న కల్కి హీరోయిన్… ఇదే లాస్ట్ మూవీనా?

Deepika Padukone : ఇదివరకు పెళ్లైతే సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేవారు హీరోయిన్లు. వాళ్ళు నటించాలి అనుకున్నా అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అయితే పిల్లలు పుట్టాక మాత్రం చాలామంది హీరోయిన్లు సినిమాలను పక్కన పెట్టేసి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో దీపికా పడుకొనే కూడా చేరబోతోందని టాక్ నడుస్తోంది.

దీపికా స్టేట్మెంట్ తో అనుమానం

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ తో దుమ్మురేపుతోంది. అయితే ఈ సినిమాలో నటించేటప్పటికే దీపికా పదుకొణె గర్భవతి. అయినప్పటికీ సినిమా ప్రచారంలో మాత్రం ఆమె ఎక్కడా వెనుకంజ వేయలేదు. దీపికా పదుకొనే బేబీ బంప్‌తో కల్కి 2898 ఏడీని ప్రమోట్ చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఇదే ఆమె చివరి సినిమా కావచ్చని అంటున్నారు. ఈ టాక్ రావడానికి కారణం ఏంటంటే దీపికా పదుకొణె గతంలో ఒకసారి చేసిన ప్రకటన.

దీపికా పదుకొణె సెప్టెంబర్‌లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇంతకుముందు ఆమె ‘మై ఛాయిస్’ వీడియోలో సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం నటనను కూడా వదులుకోవచ్చని చెప్పింది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో దీపికా పదుకొనే డేటింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రకటన చేసింది. ఇప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. త్వరలో ఒక బిడ్డకు తల్లిదండ్రులు కానున్నారు. అంతేకాదు దీపికా పదుకొనే ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పిల్లలంటే చాలా ఇష్టం, చాలా మంది పిల్లలు కావాలని, షారూఖ్ ఖాన్ కొడుకు అబ్‌రామ్, హోమీ అద్జానియా పిల్లలతో చాలా సమయం గడుపుతానని చెప్పింది.

- Advertisement -

इतनी महंगी ड्रेस में दीपिका पादुकोण ने बेबी बंप किया फ्लॉन्ट, चेहरे का नूर  देख लुट पिट गए फैन्स

ప్రసవం తర్వాత నటనకు స్వస్తి చెబుతుందా?

దీపికా పదుకొణెకి ఈ సమయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అభిమానులు తమ అభిమాన నటిని సినిమాలో చూడలేరా? అంటే ఈ ప్రశ్నకు దీపికానే స్వయంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా తన మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నటిగా సినిమాలకు దూరమైంది. అయితే ఆమె కెమెరా వెనుక పని చేయడం కొనసాగించింది.

ఇదే దీపికా చివరి మూవీ ?

దీపికా చేతిలో ఉన్న సినిమాల విషయానికొస్తే త్వరలోనే ‘సింగం ఎగైన్’లో కనిపించనుంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ చిత్రంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇందులో లేడీ సింగం పాత్రలో దీపికా పదుకొణె నటిస్తారని ఇటీవల రోహిత్ శెట్టి ప్రకటించాడు. ఇంతకు ముందు రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో భాగమయ్యారు. ఈ మూవీ తరువాత దీపికా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇది కూడా ఆమె సినిమాలకు దూరం కాబోతోందా అనే అనుమానానికి ఒక కారణం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు