Ravteja75 : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. హరీష్ శంకర్ – రవితేజ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ తర్వాత రవితేజ తన ల్యాండ్ మార్క్ సినిమా RT75 లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాకు రచయితగా పాపులర్ అయిన భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను గత ఏడాది సామజవరగమన సినిమా కి రచయితగా పని చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకి మేకర్స్ ఓ క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
మాస్ మహారాజ్ RT75 కి సాలిడ్ టైటిల్?
ఇక రవితేజ నటించబోయే కొత్త సినిమాకు మేకర్స్ ‘కోహినూర్’ అనే సూపర్ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. వినడానికి కూడా క్యాచీగా, పవర్ ఫుల్ గా ఉన్న ఈ టైటిల్ ని మేకర్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత త్వరలోనే టైటిల్ ని రివీల్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతునట్టు సమాచారం. రవితేజ లేని సీన్లు షూట్ చేస్తున్న మేకర్స్ , మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత రవితేజ త్వరలో సెట్స్ లో అడుగుపెడతాడని సమాచారం.
పండక్కి వస్తాడా? లేదా రిపబ్లిక్ కా?
ఇక రవితేజ నటిస్తున్న తన 75వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో ధమాకా రాగా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తుండగా, ఫార్చ్యూన్ రీల్స్, శ్రీకర స్టూడియోస్ వారు సహా భాగస్వామ్యంలో ఉన్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినపుడు మేకర్స్ 2025 సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. కానీ సినిమా షూటింగ్ ఆలోపు పూర్తవుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ రవితేజ నాన్ స్టాప్ గా సినిమాని ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. కుదిరితే పండక్కి లేదా, రిపబ్లిక్ డే కి రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాట్టు తెలుస్తుంది.