Ram Charan vs Jr NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి మంచి స్థానం ఉంది. వీరిద్దరి కుటుంబాల నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో రామ్ చరణ్ ( Ram Charan ) , ఎన్టీఆర్ (NTR ) లు కూడా ఉన్నారు. వీరిద్దరూ దాదాపుగా ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇద్దరికీ వారసత్వ నేపధ్యం ఉంది. ఒకరు తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసి.. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారకరామారావు పేరుతోనే సత్తా చాటిన నటుడు. మరొకరు దశాబ్దాలుగా తెలుగు సినిమా తెరపై మెగాస్టార్ గా వెలుగుతూ.. అప్పుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి వారసుడు. అయితే వీరిద్దరిలో రామ్ చరణ్ దే పై చెయ్యి అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వీరిద్దరి సినిమాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎన్టీఆర్ vs రామ్ చరణ్ మధ్య తేడాలు..
టాలీవుడ్ యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకేక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు. ఇద్దరికీ సినిమాలో సమానమైన ప్రాధాన్యత. ఒకరు అల్లూరి సీతారామరాజుగా, మరొకరు కొమరం భీమ్ గా ఒకరికి ఒకరు పోటీ పడుతూ నటించారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే విషయంపై పెద్ద పెద్ద సినీ విమర్శకులే ఏమీ తేల్చలేకపోయారు. ఎవరి స్టైల్ లో వాళ్ళు సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ మూవీకి ఆస్కార్ రావడంతో వీరిద్దరి క్రేజ్ రెట్టింపు అయ్యింది. విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. వీరిద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా వరుస పాన్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు..
తారక్ తో పోలిస్తే రామ్ చరణ్ దే పై చెయ్యి..
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో వీళ్లు ఉన్నారు. ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ వచ్చాడు. కానీ రామ్ చరణ్ మాత్రం తక్కువ సినిమాలు చేశాడు. ఎన్టీఆర్ పై రామ్ చరణ్ దే పై చెయ్యి. ఇప్పటివరకు ఎన్టీఆర్ 29 సినిమాలు చేశాడు. రామ్ చరణ్ కేవలం 14 సినిమాలు చేశాడు. సక్సెస్ రేటు కూడా రామ్ చరణ్ దే ఎక్కువగా ఉంది.. ఎటు చూసిన అతనే హైయేస్ట్ లో ఉన్నాడు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ మళ్లీ వార్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ తో పోటీ పడాలని అనడం కాదు కానీ, మనలో ఎంత ప్రతిభ ఉన్నా.. దానిని పదిమందికీ తెలిసేలా చేసుకోవడం చాలా ముఖ్యమే కదా. అది కెరీర్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా. ఒకేస్థాయి ఉన్న ఇద్దరు స్టార్స్.. వారి మధ్యలో ఎంత స్నేహం ఉన్నా.. ప్రొఫెషనల్ గా చూసుకుంటే వెనకబడిపోతున్న పరిస్థితి అభిమానులకు కాస్త బాధ కలిగిస్తుంది.. ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. వరుస ఫాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు..