Devara Movie : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Ntr ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara) .. ఈ సినిమాకు క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా, కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం లో సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ( Janvi Kapoor) ఈ మూవీ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ‘దేవర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ ను ఈ నెల 27 న విడుదల చెయ్యనున్నారు. ఈ క్రమంలో సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కోసం ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు. తాజాగా ట్రైలర్ ను లాంచ్ చెయ్యనున్నారు.
దేవర నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ జనాల ను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయిన సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టాయి. ఇక ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ రెడీగా ఉంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సైతం ఆఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టు ఎవరనేది ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు అల్లు అర్జున్ గెస్టు గా రాబోతున్నాడని ఓ వార్త ప్రచారం లో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నాడని మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అల్లు అవుట్.. మామ ఇన్..
ఎన్టీఆర్ దేవర మొదటి పార్ట్ రిలీజ్ అవ్వడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సినిమాకు జనాల్లో హైఫ్ ను క్రియేట్ చేసేందుకు కొరటాల శివ కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరో గంట తర్వాత ట్రైలర్ రాబోతుంది. దీనికోసం ఫ్యాన్స్ నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ (Allu Arjun ) అని నిన్న వార్తలు వినిపించాయి. ఈరోజు అల్లుడు అవుట్ మామా కమింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాలకు, చిరంజీవి (Chiranjeevi ) మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కాసేపు వెయిట్ చెయ్యాలి.. ఇక ఇప్పటికే వీరి కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దేవర టీమ్ కూడా చిరంజీవినే కావాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మెగాస్టార్ రాబోతున్నాడని వార్త షికారు చేస్తుంది. ఏది ఏమైనా కూడా ఎవరు గెస్టుగా వస్తారన్నది ఆసక్తిగా మారింది.