Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆగస్టు 22వ తేదీన ఆయన తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా అభిమానులు , సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయనపై ఉన్న తమ అభిమానాన్ని నిరూపించుకున్నారు. థియేటర్లలో చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేసి రీ రిలీజ్ లో కలెక్షన్ల సునామి సృష్టించారు.
చిరంజీవి అభిమానులకు నిరాశ..
ప్రస్తుతం 69 సంవత్సరాలు ఉన్న చిరంజీవి యంగ్, స్టార్ హీరోలతో పోటీ పడుతూ విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన, ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం లో విశ్వంభర సినిమా చేస్తున్నారు. నిన్న అనగా ఆగస్టు 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి చిరంజీవి లుక్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటి అనే విషయం అభిమానులలోనే కాదు సినిమాల కోసం ఎదురుచూసే సెలబ్రిటీలలో కూడా మొదలైంది.
నిర్మాతగా సుస్మిత ఫిక్స్..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రంతో డైరెక్టర్ గా ఎవరు పరిచయం కాబోతున్నారు అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. దీనికి తోడు నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందా అంటే అది లేదు. మరొక పక్క చిరంజీవి తన 157వ చిత్రం ద్వారా తన కూతురు సుస్మిత కొణిదెలను నిర్మాతగా లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా దర్శకుడు ఎవరైనా సరే సుస్మిత మాత్రం నిర్మాతగా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న తన కూతుర్ని నిర్మాతగా మార్చాలని చిరంజీవి బలంగా ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు రామ్ చరణ్ బిజీగా ఉన్న నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై ఫోకస్ తగ్గించి కూతుర్ని నిర్మాతగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు.
చిరంజీవి 157వ చిత్రానికి డైరెక్టర్ దొరకనట్టేనా..
ఈ సినిమాకి సరైన డైరెక్టర్ దొరకడం లేదు.రచయిత బివిఎస్ రవి అందించిన స్టోరీ సిద్ధంగా ఉంది కానీ దాని డీల్ చేయడానికి సరైన డైరెక్టర్ దొరకడం లేదు. హరీష్ శంకర్ , మోహన్ రాజా ఇలా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవరు కూడా కథను ఆ రేంజ్ లో ఎలివేట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మెగాస్టార్ 157వ మూవీకి ఎవరు సరైన డైరెక్టర్ అన్నది సీరియస్గా ఆలోచిస్తున్న అంశంగా కనిపిస్తోంది . చిరంజీవి దగ్గర స్టోరీ సిద్ధంగా ఉన్నా.. దర్శకులు సమస్య విపరీతంగా వేధిస్తోంది. మరొకవైపు వరుస పెట్టి సినిమాలు చేద్దామని చిరంజీవి అనుకుంటుంటే సరైన డైరెక్టర్ దొరకడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి కాస్త అయోమయంలో పడి అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు.