Star Singer : సినీ ఇండస్ట్రీలో సినిమాల సంగతి ఏమోగానీ లైంగిక వేధింపులకు గురవుతున్నాము అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతి ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన వారు రోజుకొకరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఓ స్టార్ సింగర్ లైంగిక వేధింపులకు గురైనట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఓ మేల్ స్టార్ సింగర్ ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం మాత్రమే కాదు. ఫోటోలను కూడా పెడుతూ వేధింపులకు గురి చేసినట్లు ఆలస్యంగా ఆ విషయాన్ని బయట పెట్టింది. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఓ ఊపేస్తుంది. అసలు ఆ వేధింపులకు గురైన సింగర్ ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ సింగర్ చిన్మయ్ (Chinmai) పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఈమె పేరు చెబితేనే చాలామంది గుండెల్లో దడలు పుట్టుకొస్తాయి. ఎవరైతే ఈమెను వేధించారో వారి పేర్లు బహిరంగంగానే చెబుతూ వారి పరువు మొత్తం తీసేస్తుంది.ఏ విషయమైనా సరే ఎలాంటి భయం లేకుండా బయట పెడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె కామాంధులకు వణుకు పుట్టించింది. అందుకే ఈమె ఎవరైనా ఏమైనా అనడానికి కాస్త ముందు వెనక ఆలోచిస్తారు. స్టార్ సింగర్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న చిన్మయి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్తుంది.. సమంతకు డబ్బింగ్ చెప్పేది ఈవిడనే..
ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటిసారి క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఎక్కువ ఫేమస్ అయింది.అయితే ప్రస్తుతం కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో గతంలో చిన్మయి మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. అయితే ఓ సింగర్ బాగోతాన్ని బయటపెట్టింది. ఆ సింగర్ మరెవరో కాదు.. కార్తిక్.. కార్తీక్ అంటే సింగర్ గా నాకు ఎంతో గౌరవం ఉంది.కానీ ఆయన తన హోదాని పక్కనపెట్టి ఎంతోమందిని వేధించాడు.. ఇప్పటికి కార్తీక్ కి సంబంధించిన ఎంతోమంది బాధితులు స్విజర్లాండ్, హైదరాబాద్, చెన్నై వంటి ప్రదేశాలలో ఉన్నారు. ఆయన ఎంతో మంది అమ్మాయిలను వేధించాడు.. అమ్మాయిలకు అసభ్య ఫోటోలు, వీడియోలు పంపి డేటింగ్ కి వెళ్దామా అంటూ అడిగేవాడు.
సింగర్ మనో గారి మాట విని నేను వేధింపుల గురించి బయట పెట్టలేదు. అతని వేధింపులు ఎక్కువ అవ్వడంతో ఈ విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పైకి మంచిగా ఉంటూ ముసుగు వేసుకొని ఉండటం నాకు రాదు అంటూనే అందరిని చెడుగుడు ఆడేసుకుంటుంది.. ఈసారి ఎవరి వేధింపుల గురించి చెబుతుందో చూడాలి..ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది వేధింపులకు గురిచేసినట్లు చెబుతూనే ఉంది. బయట సమాజంలో ఎప్పుడు ఎక్కడైన అమ్మాయిలు వేధింపులకు గురైతే వెంటనే రెస్పాండ్ అవుతూ .. వేధింపులకు గురైన వారికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ .. ఈ ఇండస్ట్రీ అని కాదు . ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళ గురించి సంచలన విషయాలను బయట పెడుతుంది..