Chandini Chowdary : రెండు సినిమాలొస్తున్నాయి.. అయినా పట్టించుకోవట్లేదు.. అప్పటి కామెంట్స్ ప్రభావమా?

Chandini Chowdary : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో చాందిని చౌదరి ఒకరు. తెలుగమ్మాయి అయిన ఈ భామ పదేళ్ల కింద షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలు పెట్టి కేటుగాడు అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘మను’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే చాందిని ని కి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘కలర్ ఫోటో’ సినిమాయే. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఇయర్ అల్రెడి విశ్వక్ సేన్ తో కలిసి గామి చిత్రంలో నటించగా, ఇప్పుడు తాజాగా “మ్యూజిక్ షాప్ మూర్తి”, “యేవం” చిత్రాలతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయింది. ఇక రెండు సినిమాలు కూడా జూన్ 14న థియేటర్లలో ఒకేసారి విడుదల అవుతున్నాయి. చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం చాలా అరుదైన విషయం అని చెప్పాలి. ఇక చాందిని కూడా ఒక సినిమాపై ఫోకస్ చేయకుండా, రెండు సినిమాల ప్రమోషన్లలో కూడా పాల్గొంటూ బిజీ అయింది.

Chandini Chowdary starrer Music Shop Murthy and Yevam movies releasing tomorrow

రెండు సినిమాలొస్తున్నా పట్టించుకోవడం లేదు?

ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించగా, మరో ముఖ్య పాత్రలో ఫిమేల్ లీడ్ గా చాందిని చౌదరి నటించింది. ఈ సినిమాని శివ పలడుగు డైరెక్ట్ చేయగా, కామెడీ ఎంటర్టైనర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న రిలీజ్ అవుతుంది. అలాగే చాందిని చౌదరి మెయిన్ లీడ్ గా ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా “యేవం”. ఈ సినిమాలో వశిష్ఠ సింహ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను ప్రకాష్ దంతులూరి డైరెక్ట్ చేయగా, ఈ సినిమా కూడా జూన్ 14న రిలీజ్ అవుతుంది. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా చాందినిచౌదరి మెయిన్ లీడ్ గా నటించగా, గత కొన్ని రోజులుగా ప్రమోషన్లు కూడా నాన్ స్టాప్ గా చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆన్లైన్ లో ఆశించిన బుకింగ్స్ జరగలేదు. అసలు ఈ సినిమాల గురించి కూడా బయట ప్రేక్షకులు మాట్లాడుకోవట్లేదని చెప్పాలి. మరి కారణం ఏమై ఉంటుందా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుంటే బహుశా చాందిని నెల కింద చేసిన వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపుతున్నాయా అని టాక్ నడుస్తుంది.

- Advertisement -

ఐపీఎల్ తో రచ్చ లేపిన చాందిని..

అయితే చాందిని చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్ సందర్బంగా ప్రెస్ మీట్ జరగగా, అప్పుడు చాందిని చౌదరి IPL ని ఉద్దేశించి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓ విలేఖరి ఐపీఎల్ లో మీ ఫెవరేట్ టీం ఏది అని అడిగితే, దానికి చాందిని చౌదరి సమాధానమిస్తూ తాను ఇప్పటివరకు IPL మ్యాచ్స్ చూడలేదని CCL చూసాను కానీ, ఐపీఎల్ చూడలేదని ఒక్కసారి వచ్చి చూసి ఆ ఫీల్స్ లోని ఫెవరేట్ ని సెలెక్ట్ చేసుకుందామని చుస్తున్నానని అంది. హైదరాబాద్ ఉంది కదా అని అంటే… మాది ఆంధ్ర కదా మా ఆంధ్రకు టీమ్ లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ అప్పుడు బాగా ట్రోల్ అయ్యాయి. ఈ విధంగా ఆంధ్ర, తెలంగాణ అంటూ చిచ్చు లేపుతుందని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఆడియన్స్ రేపు విడుదల అవుతున్న చాందిని చౌదరి సినిమాలని పట్టించుకోవట్లేదని కామెంట్స్ వస్తున్నాయి. అయితే సినిమాలకి మంచి టాక్ గనుక వస్తే.. ఇలాంటి కామెంట్స్ పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి రేపు విడుదల అవుతున్న యేవం, మ్యూజిక్ షాప్ మూర్తి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు