Balayya : నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. గతేడాది సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వీరసింహారెడ్డి’ అందులో ఒకటి. ఈ విలక్షణమైన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ వీరసింహా రెడ్డి కూడా ఓ రకంగా హిట్టే అన్పించింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే బాలయ్య నెక్స్ట్ మూవీ ఏంటి అని ఆలోచినస్తున్న నందమూరి అభిమానుల కోసం. తాజాగా వీరసింహా రెడ్డి కాంబో రిపీట్ కాబోతోంది అని తాజాగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? బోయపాటిని బాలయ్య మళ్లీ పక్కన పెట్టేశారా?
వీరసింహా రెడ్డి కాంబో రిపీట్
దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య అభిమానులు మెప్పించేలా తెరపై ఆయనను చూపించడంలో, వీరసింహా రెడ్డి ద్వారా నందమూరి అభిమానులకు కావాల్సిన హీరో ఎలివేషన్ సీన్స్, మాస్ ప్రెజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ గా బాలయ్య ఫ్యాన్స్ ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్య చేసిన ‘భగవంత్ కేసరి’ కూడా హిట్ అయింది. ఆయన ప్రస్తుతం #NBK109 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బాబీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో బాబీ-బాలయ్య మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు గోపీచంద్ రవితేజతో ఒక ప్రాజెక్ట్ ప్రకటించాడు. కానీ అది ఆగిపోయింది. పైగా ఆయన ప్రస్తుతం సన్నీ డియోల్‌తో కలిసి ఓ హిందీ ప్రాజెక్టు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆయనకు ఇదే మొదటి ప్రాజెక్టు. ఈ మూవీ తరువాత బాలయ్య మూవీని గోపీచంద్ స్టార్ట్ చేస్తారని, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
బోయపాటిని బాలయ్య మళ్ళీ పక్కన పెట్టారా?
అయితే నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా మాత్రం అఖండ 2. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన అఖండ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. అందుకే ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ మూవీ ఆలస్యం అవుతూనే ఉంది. NBK109 పూర్తయ్యాక బాలయ్య బోయపాటితో సినిమా చేస్తారని అనుకున్నారు. అయితే అదే నిజం అయ్యే ఛాన్స్ లేకపోలేదు. NBK109 మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. మరోవైపు గోపీచంద్ తన హిందీ సినిమాను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఆయన ఆ సినిమా పూర్తయ్యేలోపు బాలయ్య అఖండ 2 మొదలు పెట్టే అవకాశం ఉంది. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌లలో ఏది ముందుగా మొదలవుతుందో చూడాలి.