Ram Charan Vs Ntr : టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంత తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు లాగా ఉంటారు. వీరిద్దరు కలిసి త్రిపుల్ ఆర్ సినిమాలో నటించారు. ఇటీవల ఇద్దరు కలిసి తిరగడం చూశాం. ఈ మధ్య వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించలేదు. అందుకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయా అనే టాక్ నడుస్తుంది. ఇక ఫ్యాన్స్ కూడా వీరికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి మా హీరో మెయిన్ రోల్ అంటే మా హీరో మెయిన్ రోల్ అంటూ గొడవలు పడ్డారు. విజయేంద్ర ప్రసాద్ తారక్ క్యారెక్టర్ ను అద్భుతంగా పొగిడితే సపోర్టింగ్ రోల్ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి తారక్- చరణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.. ఇక తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని బయట పడింది..
ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తన స్నేహితుడిని సినిమా విడుదల అవుతుంటే కనీసం ఆల్ చెప్పలేదు. ఇక ఆయన అసలు హైదరాబాద్ లోనే ఉండరని వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ – తారక్ మధ్య గొడవలు అంటూ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ రోజు రామ్ చరణ్ కావాలనే… స్టేట్ లో ఉండకుండా బయటికి వెళ్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..తారక్ సినిమా రిలీజ్ రోజు ఇక్కడ ఉండ కూడదు అనే ఉద్ధేశ్యంతోనే రామ్ చరణ్ అక్కడికి వెళ్తున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్ అప్పుడు తారక్ కూడా ఇలానే హైదరాబాద్ లో ఉండకుండా, కర్నాటక లో ఓ టెంపుల్ కి వెళ్లాడు.. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య గొడవలు నిజమే అని నమ్ముతున్నారు..
అయితే రామ్ చరణ్ – తారక్ విషయంలో వస్తున్న ఈ వార్తలు కరెక్ట్ కాదు… చరణ్ IIFA 2024 ఈవెంట్ కు వెళ్తున్నాడు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఏడాది 2024 ఐఫా అవార్డ్స్ అంగరంగ వైభవంగా అబుదాబిలోని యస్ ఐలాండ్ లో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగనున్న క్రమంలో ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 28న అవార్డ్స్ ప్రధానం జరుగనుండగా 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకు సంబదించి నాని నటించిన దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు అత్యధిక నామినేషన్లు పొందాయనే సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ IIFA ఉత్సవంలో పాల్గొననున్నట్టు ఆయన పీఆర్ టీం వెల్లడించింది. మరి దీనిపై ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి..