Anushka : అనుష్క ఎఫైర్ల కథ… ప్రభాస్ కంటే ముందే ఏకంగా ముగ్గురు హీరోలతో!?

Ansuhka : సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మీద గాసిప్స్ అన్నవి సర్వసాధారణం. ఒకే హీరోయిన్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేసినా, లేదా సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరి పెయిర్ బాగున్నా.. అసలు ఇలాంటివి ఏమీ లేకున్నా కూడా ఓ హీరోయిన్ ఫలానా హీరోతో రిలేషన్ షిప్ లో ఉంది అంటూ ఆకాశ రామన్న ట్వీట్లు, వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి రూమర్ల బారిన పడిన హీరోయిన్లలో అనుష్క కూడా ఒకరు.

ప్రభాస్ తో పెళ్ళి దాకా…

అనుష్క చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు 19 సంవత్సరాలు అవుతోంది. తన సుదీర్ఘ కెరీర్‌లో అనుష్కకు ఒక్క వివాదం కూడా లేదు. కానీ ఆమె పేరు మాత్రం ఎఫైర్ రూమర్స్ లో లెక్కలేనన్ని సార్లు చిక్కుకుంది. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపినట్లు గుసగుసలు విన్పించాయి. ప్రభాస్ తో అయితే ఏకంగా పెళ్లిదాకా తీసుకెళ్లారు రూమర్ రాయుళ్ళు.

అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చాలా క్రమశిక్షణ కలిగిన నటి. ఆమె కొన్ని చిత్రాలలో గ్లామరస్ పాత్రలు చేసింది. కానీ ఈ బ్యూటీని గ్లామర్ డాల్ లా మాత్రం చూడరు అభిమానులు. అందుకు కారణం ఆమె చేసిన సినిమాలు. అలాగే అనుష్క సోషల్ మీడియాను ఉపయోగించదు. ఇండస్ట్రీలో అందరూ ఆమెను స్వీటీ అని పిలుస్తుంటారు. ఆమె స్వభావం, ప్రవర్తన కూడా చాలా సింపుల్… ఒక్క మాటలో చెప్పాలంటే మిస్ పర్ఫెక్ట్. అయితే సర్వత్రా వేధిస్తున్న ప్రశ్న అనుష్క పెళ్లి ఎప్పుడు?

- Advertisement -

prabhas and anushka shetty wedding photos with daughter AI generated viral on social media | Prabhas और Anushka Shetty की AI ने करवा दी शादी, बेटी को गोद में लिए फोटोज हुए

ఇక ప్రభాస్, అనుష్కల పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. మా మధ్య ఏమీ లేదని, మేం మంచి స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు, మీడియా నమ్మడం లేదు. బాహుబలి సినిమా సమయంలో మొదలైన అనుష్క, ప్రభాస్ పెళ్లి పుకార్లు ఇంకా షికారు చేస్తున్నాయి. అయితే ప్రభాస్ కంటే ముందు అనుష్కపై కొన్ని ఎఫైర్ రూమర్స్ వచ్చాయి.

ఈ ముగ్గురు హీరోలతో..

అనుష్క డెబ్యూ మూవీ సూపర్. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేసుకుంది. సూపర్ తర్వాత అనుష్క, నాగార్జున జంటగా డాన్, కేడీ చిత్రాల్లో నటించారు.. ఈ నేపథ్యంలో నాగార్జున, అనుష్కల మధ్య ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి. అలాగే నాగ చైతన్యతో కూడా ఆమెకు లింకు పెట్టారు.

హీరో గోపీచంద్-అనుష్క ప్రేమలో ఉన్నారని లక్ష్యం సినిమా టైమ్ లో వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో గోపీ చంద్ సరసన అనుష్క శెట్టి నటించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో శౌర్యం సినిమా విడుదలై విజయం సాధించింది. ఈ సమయంలో అనుష్క, గోపీచంద్‌లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని అన్నారు. అయితే 2013లో గోపీచంద్ వేరే పెళ్లి చేసుకున్నారు.

రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్, అనుష్క ప్రేమించుకుంటున్నారని పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఈ పెళ్లి వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుందామనుకున్న ఆమె తరువాత మనసు మార్చుకుందనే కొత్త వాదన కూడా వచ్చింది. ఇలా అనుష్కకు ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో ఎఫైర్ అంతగట్టారు గాసిప్ రాయుళ్ళు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు