Allu VS Mega :ఏపీలో జరిగిన ఎన్నికల తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు అని రోజుకో వార్త నెట్టింట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ గొడవలు ఏమో గానీ ఫ్యాన్స్ మధ్య వార్ రోజు రోజుకు ముదిరిపోతుంది. మా హీరో ఎందులోనూ తగ్గేదేలే అని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టాలని అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా అల్లు అరవింద్ మరో అడుగు ముందుకు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 కోసం ఏకంగా మెగా హీరోలను దించుతున్నాడని టాక్ ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అసలు మ్యాటరేంటంటే..
మెగా Vs అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు..
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటి చేసి డిప్యూటీ సీఏం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు బన్నీ జనసేనకు సపోర్ట్ చెయ్యకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చెయ్యడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. అప్పుడు మొదలైన ట్రోలింగ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాని ఎఫెక్ట్ బన్నీ సినిమా పై పడినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇటీవల బన్నీ, సుకుమార్ మధ్య గొడవలు వచ్చాయని అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసినట్లు కూడా ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
సుకుమార్, బన్నీ మధ్య గొడవలు..
పవన్ కళ్యాణ్ వల్లే పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అందుకే సుక్కు చెప్పకుండా విదేశాలకు చెక్కెసాడని, ఇక బన్నీ కూడా గడ్డం తీసేసి ఫారిన్ వెళ్లాడు. దాంతో పుష్ప 2 ఇక రాదని ఫ్యాన్స్ నెట్టింట చర్చలు మొదలు పెట్టారు. ఈ వార్తల పై సుకుమార్ గాని, బన్నీ కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఈ పాయింట్ తో గొడవలు నిజమే అనే అభిప్రాయానికి వచ్చేసారు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్..
మెగా ఫ్యామిలీతో గొడవలకు అల్లు అరవింద్ చెక్..
అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు అల్లు అరవింద్ చెక్ పెట్టాలని చూస్తున్నాడు. పుష్ప 2 ను త్వరగా పూర్తి చేసి, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను గెస్టులుగా పిలవాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అరవింద్ మెగాస్టార్ ఫ్యామిలితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కు మెగా హీరోలతో పాటుగాపవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఇది పెద్ద ప్యానల్ డే మూవీ పెద్ద హిట్ కావడానికి వాళ్ళు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ప్రూఫ్ చేయడానికి అల్లుఅర్జున్ చూస్తున్నారని టాక్. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..