Allu Arjun vs Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సరైనోడు సినిమా ఈవెంట్ దగ్గర మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ఆ ఫంక్షన్ తర్వాత చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పలుచోట్ల కలిసి కనిపించారు. ఇకపోతే శ్రీరెడ్డి వివాదం జరిగినప్పుడు, అలానే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో భాగంగా నర్సీపట్నం కూడా అల్లు అర్జున్ వెళ్లి కలవడం జరిగింది. అంతా సర్దుమనింది అనుకునే టైంలో కొన్ని విషయాలు మళ్లీ తీవ్ర ప్రకంపనలు రేపాయి.
అల్లు అర్జున్ స్నేహితుడు శిల్ప రవి నంద్యాల లో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే వైయస్సార్సీపీకి వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని వైఎస్ఆర్సిపి పార్టీ ఎలా డీల్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ చాలామందిని ఇబ్బంది పెట్టింది. చిరంజీవి లాంటి వ్యక్తి కూడా చేతులెత్తి జగన్ కి దండం పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ చాలామంది మెగా అభిమానుల్లో జీర్ణించుకోలేని విషయాలు. అటువంటి పార్టీ వ్యక్తికి అల్లు అర్జున్ వెళ్లి సపోర్ట్ చేయడం అనేది మామూలు వివాదానికి దారి తీయలేదు.
ఇక రీసెంట్ గా కూడా మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ నాకు ఇష్టమైతే నేను వస్తా అని చెప్పడం కూడా ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో పుష్పా సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడారు. అయితే అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశ పూర్వకంగా మాట్లాడకపోయినా కూడా చాలామంది తమకు తాముగా ఆ మాటలను అన్వయించుకున్నారు.
ఇక అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత చాలామంది అనేక ఆరోపణలు చేశారు. ఈవీఎం సీఎం, ఈవీఎం డీసీఎం అంటూ అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ కూడా చేశారు. బహుసా ఈ ట్రోల్ అల్లు అర్జున్ వరకు చేరి ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. అందుకే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవన్ కళ్యాణ్ అండ్ డి సి ఎం అని అల్లు అర్జున్ ట్విట్ చేశాడు. దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేస్తూ బర్త్డే విషెస్ చెప్పాడు బన్నీ అంటూ మళ్లీ ఎటాక్ మొదలుపెట్టారు.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024