Allu Arjun..డిసెంబర్ 6వ తేదీన అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులకు పెద్ద పండుగ.. పుష్ప-2 సినిమా ఆ రోజున విడుదలవుతుందంటూ కచ్చితంగా అల్లు అర్జున్ ఇటీవలే తెలియజేస్తూ ఉన్నారు. ఈ సినిమా పుష్ప సినిమాకి మించి ఉండేలా డైరెక్టర్ సుకుమార్ కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక రష్మిక (Rashmika) గురించి, ఆమె నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫహద్ ఫాజిల్ (Fahad fazil) ఇందులో ఈసారి విభిన్నమైన తీరులో కనిపించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప-2 సినిమా రిలీజ్ కి ముందే అల్లు అర్జున్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయబోతున్నారట. అది కూడా మిగిలిన యాక్టర్స్ కు చాలా డిఫరెంట్ గా ఉండేలా ప్రయత్నాలు చేయబోతున్నట్లు సమాచారం.
ఆర్మీ కోసం ప్రత్యేక గది..
దీంతో అల్లు అర్జున్ ఆర్మీ కోసం ఏం చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, అల్లు అర్జున్ తన ఆర్మీ కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నారని టాక్.అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప సినిమాకి రిలీజ్ కి ముందే తను కట్టించుకుంటున్న ఒక కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని బన్నీ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, ఆఫీసును సైతం ఒక విశాలవంతమైన ప్రదేశానికి షిఫ్ట్ చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లో కొత్త ఇల్లు నిర్మిస్తున్న బన్నీ..
అల్లు అర్జున్ ఇందుకోసం హైదరాబాదులో జూబ్లీహిల్స్ వెంకటగిరి ఏరియాలో కొన్ని కోట్ల రూపాయలతో తన ఇంటిని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తన భవనంతో పాటుగా తన ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం మూడు వేల చదరపు అడుగుల వైశాల్యంలో తన ఇంటిని చాలా విలాసవంతంగా నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి 60% వరకు పనులు పూర్తయ్యాయని సమాచారం. అయితే సుమారుగా ఈ ఇంటికి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తన భార్య స్నేహ రెడ్డితో కలిసి గృహప్రవేశం చేయబోతున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.
ఇండస్ట్రీలోని అత్యంత కాస్ట్లీ ఇల్లు..
అల్లు అర్జున్ నిర్మిస్తున్న ఇల్లు, తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత కాస్ట్లీ ఇల్లుగా మిగిలిపోతుందట. దీన్ని బట్టి చూస్తే ఈ ఇంటికి సుమారుగా రూ.200 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంటికి సమీపంలోనే ఈ ఇంటిని నిర్మించబోతున్నట్లు సమాచారం. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పక్కన ఈ ఇల్లు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అల్లు అర్జున్ ఇందులో అభిమానులను కలవడానికి ఒక సపరేటు రూమును కూడా కేటాయించబోతున్నారట.. అభిమానులు ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గరకు వస్తే కేవలం బయటే కలిసే పరిస్థితి ఉన్నదని , ఇకమీదట అలాంటివన్నీ ఏమీ లేకుండా తన ఆర్మీ కి ఇబ్బంది లేకుండా చూసుకొనేలా తన కొత్త ఇంటిలో చాలా సౌకర్యాలను ఏర్పరచుకున్నట్లు సమాచారం. దీనితో అభిమానుల సైతం అల్లు అర్జున్ కొత్త ఇల్లు ఎలా ఉండబోతోంది అంటూ అందరూ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.