Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ( Alia Bhatt) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈమె సినిమా చేసింది. రామ్ చరణ్ ( Ram Charan ), ఎన్టీఆర్ ( NTR ) ప్రధాన పాత్రలో నటించిన త్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. పెళ్ళై, ఓ బిడ్డకు తళ్ళైన చెక్కు చెదరని అందంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అయితే అలియా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈమె ఇంటిపేరు మార్చుకుందని తెలుస్తుంది. దీంతో విడాకులు తీసుకోబోతున్నారా అనే వార్తలు ఊపందుకున్నాయి.
అలియా తన ఇంటిపేరును మార్చుకోబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. రీసెంట్‌గా గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కు హాజరైన అలియా ఇంటి పేరును మార్చుకోవడంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె తన పేరు కు కపూర్‌ని చేర్చుకున్నారా లేదా రణ్ బీర్ చేర్చుకుంటారా? అనే సందేహాలపై అభిమానులకు స్పష్టత ఇచ్చింది.. ఈ అమ్మడు జీగ్రా మూవీ ప్రమోషన్స్ లో ఇటీవల పాల్గొన్నారు. ఈ సమయంలో ‘ హాయ్ అలియా భట్’ అంటే.. దానికి అలియా బదులిస్తూ.. మే హూన్ అలియా భట్ కపూర్ అని చెప్పింది. పెళ్ళై మూడేళ్లు అవుతున్నా ఇప్పుడు పేరు మార్చుకోవడం పై ఆమె ఫ్యాన్స్, ఫ్యామిలీ షాక్ అయ్యారు. ఇంటిపేరును ఎందుకు మార్చుకున్నారో అనే సందేహాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా కొత్త పేరు బాగానే ఉందని కొందరు కామెంట్స్ చెయ్యగా.. మరొకరు విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అలియాభట్ ఇంటి పేరు ఎందుకు మార్చుకున్నారో తెలియాల్సి ఉంది..
అలియా భట్ , రణబీర్ కపూర్ (Rnabir Kapoor ) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2022 ఏప్రిల్ 14న వీళ్లిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. అదే సంవత్సరం నవంబర్ లో పండంటి ఆడబిడ్డ జన్మించింది అలియా.ఇక బిడ్డ అలనా పాలనా చూస్తూనే మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రజెంట్ ఈ మూవీని పూర్తి స్వింగ్‌లో ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రంలో తన సోదరుడి పాత్రలో నటించబోతున్న వేదాంగ్ రైనాతో కనిపించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కాబోతుంది.. ఇటీవల అలియాభట్ నటిస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.