Aishwarya Rai.. గత కొద్ది రోజులుగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ నుంచి విడిపోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరు ప్రవర్తించిన తీరు కూడా అందరిలో అనుమానాలు రేకెత్తించేలా చేసింది. మరొకవైపు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు బాగా వైరల్ గా మారాయి. అయితే ఈ విడాకుల విషయంపై అటు అభిషేక్ , ఇటు ఐశ్వర్యారాయ్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలా అని వారు ఖండించలేదు. దీంతో ఈ విడాకుల వార్త మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా అసలు విషయం ఏంటని అభిమానులు సైతం కనిపెట్టే పనిలో పడ్డారు. దాంతో ఒక్కో అంశంపై క్లూలు సంపాదించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్ స్టార్ జంట విడిపోవడానికి అసలు కారణం ఇదే అంటూ మరో కొత్త వార్తను తీరపైకి తీసుకువచ్చారు.
డాక్టర్ తో ఐశ్వర్యారాయ్ క్లోజ్..
ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు విషయం మధ్యలోకి ఒక కొత్తగా వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది.. ఒక డాక్టర్ తో ఐశ్వర్యరాయ్ క్లోజ్ గా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి .ఆయన పేరు జిరాక్ మార్కర్. వీరిద్దరి మధ్య డీప్ ఫ్రెండ్షిప్ చాలా కాలంగా ఉందని సమాచారం. ఇక వీరిద్దరి స్నేహమే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం అయ్యింది అంటూ ఒక వార్త బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. నిజానికి ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ చాలాకాలంగా స్నేహితులుగా ఉన్నారట. ఇక వీరిద్దరూ ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగించకపోతే ఈ డివోర్స్ రూమర్స్ వినిపించేవి కావు అని కూడా నెటిజన్లు చెబుతున్నారు. ఇటీవల ఒక ఈవెంట్ లో ఐశ్వర్యారాయ్ జిరాక్ మార్కర్ కు సంబంధించి.. వీరు కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐశ్వర్యారాయ్,జిరాక్ మార్కర్ మధ్య ఏదో నడుస్తోందే..
ఇక ఈ ఫోటోలు బయటకు రావడంతో ఐశ్వర్యారాయ్, జిరాక్ మార్కర్ మధ్య ఏదో నడుస్తుందని అప్పుడే ప్రజలు ఊహాగానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ , జిరాక్ మార్కర్ మధ్య ఉన్న స్నేహామే, విడాకులు ఇవ్వడానికి కారణం అయ్యింది. మొత్తానికి అయితే గత కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్న నేపథ్యంలో దీనికి తోడు ఇలాంటి వార్తలు పైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు.
అంబానీ వేడుకల్లో ఒంటరిగా ఐశ్వర్య..
ఇదిలా వుండగా.. పారిశ్రామిక వేత్త అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి అభిషేక్ బచ్చన్ కుటుంబం మొత్తం హాజరైంది. ఈ వివాహానికి ఐశ్వర్య బచ్చన్ కూడా వచ్చింది . కానీ తన కూతురు ఆరాధ్య బచ్చన్ తో మాత్రమే ఒంటరిగా వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఐశ్వర్యరాయ్ . దీంతో విడాకులు తీసుకోబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ వార్తలను ఖండిస్తారా లేక నిజం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.