Aishwarya Rai.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ఐశ్వర్యరాయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొన్ని నెలలుగా కొన్ని రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఈమె విడాకులు తీసుకున్నదంటూ ప్రచారం కూడా జరుగుతోంది. 2007లో ఐశ్వర్య అభిషేక్ ఇద్దరూ కూడా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండే ఈ జంటపై ఈ ఏడాది మొదటి నుంచి బాలీవుడ్ మీడియాలో పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి రూమర్స్ కి ఎప్పటికప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ చెక్ పెడుతూ.. ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నా రూమర్స్ అయితే ఆగడం లేదు.
విడాకుల బాట పట్టిన ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్..
ముఖ్యంగా అంబానీ ఇంట జరిగిన పెళ్లి కూడా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల ప్రస్తావనకి మరింత బలాన్ని చేకూర్చడానికి కారణం అయ్యింది. ముఖ్యంగా అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే.. అంబానీ ఇంట పెళ్లి సమయంలో ఫోటో సెక్షన్ లో బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యారాయ్ ఒక్కరే ఫోటోలు దిగడంతో ఈ విడాకుల విషయానికి మరింత బీజం పోసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి విదేశాలకు వెళ్లేటప్పుడు ఇద్దరే కలిసి వెళ్లడం కూడా విడాకుల చర్చకు దారితీసింది.
క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్..
దీనికి తోడు మొన్నా మధ్య అభిషేక్ బచ్చన్ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని , తమపై వస్తున్న విడాకుల రూమర్స్ పై స్పందించారు. ఎప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుని, ప్రేమను కురిపించుకుంటామని, అసలు తమ మధ్య విడాకులకు చోటు లేదంటూ క్లారిటీ ఇచ్చారు అయినా సరే రూమర్స్ మాత్రం ఆగేలా కనిపించడం లేదు.
మళ్లీ పెళ్లికి సిద్ధమైన ఐశ్వర్య..
ఇలాంటి సమయంలోనే ఐశ్వర్యరాయ్ ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వినిపించాయి. అది కూడా ఒక డాక్టర్ తో ఈమె చాలా క్లోజ్ గా మూవ్ అవుతోందని, అతని పేరు జిరాక్ మార్కర్ అన్నట్టుగా సమాచారం. గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ ఒక ఈవెంట్లో ఐశ్వర్య ఈ డాక్టర్ కి ముద్దులు ఇవ్వడం వల్ల వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉందంటూ వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్గా మారాయి. దీంతో ఐశ్వర్యరాయ్ కూడా ఈ డాక్టర్ తో వివాహానికి సిద్ధం అయ్యింది అనే విధంగా రూమర్ వినిపిస్తోంది.
ఫ్రెండ్ మాత్రమే ప్రేమ లేదంటున్న ఐశ్వర్య సన్నిహితులు..
అయితే ఐశ్వర్యారాయ్ కాలేజ్ ఫ్రెండ్స్ తెలుపుతున్న సమాచారం మేరకు వీరిద్దరూ కాలేజీ డేస్ నుంచి మంచి స్నేహితులుగా ఉండే వారని తెలియజేస్తున్నారు. వీరి మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని కూడా తెలియజేశారు. అయినా సరే ఇప్పుడు ఇతడు వల్లి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ మధ్య విడాకులు మొదలయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.