Bharateeyudu2 : ఆ ఒక్కడి కోసమే ‘సేనాపతి’ వస్తాడట..? కథలో ఎవరా ఒక్కడు?

Bharateeyudu2 : త్వరలో రిలీజ్ అవ్వబోతున్న పాన్ ఇండియా సినిమాల్లో భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి ఇండియన్2. ఈ సినిమాని తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమాలో జూలై లో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో అందరి దృష్టి సేనాపతి విశ్వరూపం మీదనే ఉన్నప్పటికీ, కథలో కీలకమైన పాత్రను సిద్దార్థ్ పోషిస్తున్నట్లు కోలీవుడ్ నుండి టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కథ ప్రకారం, సేనాపతి విదేశాల్లో ఉన్న సమయంలో భారతదేశంలో అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తున్న ఒక యువకుడిని గురించి తెలుసుకుంటాడు. ధర్మం కోసం సొంత కొడుకునే చంపేసిన సేనాపతి ఈసారి తన కొడుకు వయసున్న మరొక యువకుడిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడట. ఆ యువకుడిని లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రాణాలు పోవచ్చు అనిపించినప్పుడు అతన్ని రక్షించేందుకు వయసు మళ్ళిన సేనాపతి తిరిగి భారతదేశంలో అడుగుపెడతాడట.

After Kamal Haasan in Bharateeyudu2, Siddharth is the most important character

ఆ ఒక్కడు ఎవరు?

ఇక సేనాపతి ఇండియాలోకి రాగానే ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలు రజనీకాంత్ “శివాజీ” తరహాలో వ్యవస్థలో డొల్లతనాన్ని చూపించేలా ఉంటాయట. ఇక దర్శకుడు శంకర్ ఈసారి మరింత ప్రత్యేకంగా సేనాపతి విధించే శిక్షలను డిజైన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో ఆ ఒక్కడు ఎవరా అన్న చర్చ నడుస్తుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం కమల్ తర్వాత అంతటి కీలకమైన పాత్ర సిద్ధార్థ్ అనే అంటున్నారు. లేదా పరిచయం చేయని మరో పాత్ర కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి ఎవరా అన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాల్సింది తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఒక పాట తప్ప ఇంకే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయని “భారతీయుడు 2” బృందం జూన్ 1న చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ స్పెషల్ గెస్టులుగా వస్తారనే ప్రచారం ఉంది.

- Advertisement -

ఇండియన్2 తర్వాతే గేమ్ ఛేంజర్..

ఇక ఇండియన్2 (Bharateeyudu2) సినిమాలో కాజల్ అగర్వాల్ మరో స్పెషల్ పాత్రలో నటిస్తుండగా బ్రహ్మానందం, బాబీ సింహా, ఎస్.జె. సూర్య వంటి ప్రముఖ నటులు కూడా “భారతీయుడు 2″లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, శంకర్ “గేమ్ ఛేంజర్” మీద పూర్తి ఫోకస్ పెడతారని తెలుస్తోంది. “భారతీయుడు 2″తో శంకర్ మరోసారి తన సత్తా చటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోబో తరువాత మళ్ళీ సరైన సక్సెస్ చూడలేదు. భారతీయుడు 2 (Bharateeyudu2) హిట్టాయితేనే శంకర్ భవిష్యత్తు ప్రాజెక్టులపై అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక భారతీయుడు2 విడుదల తర్వాత మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు