Thangalan collections.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తాజాగా హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం తంగలాన్.. సామాజిక స్పృహ కలిగిన డైరెక్టర్ పా.రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నీలం ప్రొడక్షన్స్ స్టూడియో, గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఈ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీరంగం సృష్టించింది అని చెప్పాలి. మొదటి షో తోనే మంచి హిట్ టాక్ చేసుకుంది.
Thangalan collections: Veerangam created by Vikram.. all the crores on the first day..?
మొదటి షో తోనే హిట్ టాక్..
ఈ నేపథ్యంలోనే భారీ విజయం సొంతం చేసుకోవడంతో మొదటి రోజు ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మరి ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టారు? కలెక్షన్లు ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో తంగలాన్..
తంగలాన్ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తెగలను అక్కడి భూస్వాములు, బ్రిటీష్ ప్రభుత్వం ఉపయోగించుకొని వారిపై ఎలాంటి క్రూరమైన వివక్షత చూపించారు అనే పాయింట్ తో సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా విక్రమ్ యాక్టింగ్ కి పూర్తి స్థాయిలో ప్రశంసలు లభించాయి. అలాగే విక్రంతోపాటు పేరు ఉన్న నటీనటులకు, డైరెక్టర్ కి , ఇతర సాంకేతిక నిపుణులకి పారితోషకంతో పాటు సినిమా బడ్జెట్ మొత్తం కలిపి రూ.140 కోట్లని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
తొలిరోజే రూ.26 కోట్లు..
విక్రమ్ 61వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా దాదాపు 1600 స్క్రీన్ లలో విడుదలైంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగులో రిలీజ్ చేయగా.. తమిళనాడు, ఏపీ , నైజాంలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. ఈ సినిమా తొలి రోజు రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తమిళంలో విక్రమ్ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.11 కోట్ల కలెక్షన్స్, 15 కోట్ల రూపాయల గ్రాస్, మలయాళం లో రూ.20 లక్షలు నికరం , రూ .50 లక్షల గ్రాస్, తెలుగులో రూ.1.5 కోట్ల నికరం , రూ.3 కోట్ల గ్రాస్, కన్నడలో రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇండియాలోనే మొదటి రోజు రూ.20 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజే 26 కోట్ల రూపాయలను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో సానుకూలంగా ఓపెనింగ్ కూడా కనిపించడం గమనార్హం. ప్రస్తుతం రూ.66 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని సినిమా పండితులు చెబుతున్నారు.