Saripodhaa Sanivaaram Collections : నేచురల్ స్టార్ నాని నటించిన “సరిపోదా శనివారం” సినిమా విడుదల రోజు నుండే అదిరిపోయే వసూళ్ళతో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. నాని (Nani) – వివేక్ ఆత్రేయ (vivek atreya) కాంబోలో అంటే సుందరానికి సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ భారీగా అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక విడుదలైన రోజు ఓపెనింగ్స్ విషయంలో కాస్త తడబడ్డా, రెండో రోజు నుండే స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తూ, అదిరిపోయే కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఇతర భాషల్లో అంతగా ప్రభావం చూపకపోయినా, తెలుగు వెర్షన్ మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా తొలివారం పూర్తి చేసుకోగా సరిపోదా శనివారం ఫస్ట్ వీక్ వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
వీకెండ్ లో విజృంభించి, వర్కింగ్ లో చల్లబడ్డారు..
ఇక నాని సరిపోదా శనివారం ప్రీమియర్స్ నుండే మంచి టాక్ తెచ్చుకోగా, అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబట్టిందిఇక తొలిరోజు ఓపెనింగ్స్ లో తడపబడినా, వీకెండ్ లో ఓవరాల్ గా మంచి హోల్డ్ చూపించింది. అయితే వర్కింగ్ డేస్ లో సరిపోదా శనివారం ఆశించింత హోల్డ్ చూపించలేదని చెప్పాలి. అయితే ఓవర్సీస్ లో మాత్రం వర్కింగ్ డేస్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధించింది. ఇక సరిపోదా శనివారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికి వస్తే… తెలుగు రాష్ట్రాల్లో 22. 32 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 5.90 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో ఏకంగా 10.85 కోట్ల షేర్ వసూలు చేసింది.
బ్రేక్ ఈవెన్ కి ఇంకా దూరంగానే?
ఇక సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా మొదటివారం వరల్డ్ వైడ్ గా 39.07 కోట్ల షేర్, 72.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే 93 శాతం టార్గెట్ ని అందుకున్న అయిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఇంకా 2.93 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే వర్షాల ప్రభావం చేత ఆంధ్ర ప్రదేశ్ లో సరిపోదా శనివారం కాస్త వెనకబడింది. లేదంటే ఈపాటికి పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయి క్లీన్ హిట్ గా నిలిచేది. ఇక ఈ రెండో వీకెండ్ లో సినిమా మళ్ళీ పుంజుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అయిన సరిపోదా శనివారం ఈ వీకెండ్ లో మిగతా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా దూసుకుపోతుంది. ఇక ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే వంద కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అనేది ఈ వీకెండ్ అయ్యాక తెలుస్తుంది.