Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. నాని (Nani) – వివేక్ ఆత్రేయ వంటి క్రేజీ కాంబోలో సినిమా రావడం వల్ల భారీ అంచనాలు ఏర్పడగా, ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషల్లో మినహా అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజ్ లో టాక్ రాకపోయినా, రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో చాలా బెస్ట్ అనిపించుకోవడంతో నాని సినిమాకి జనాలు క్యూ కట్టారు. ఇక నాని, ఎస్.జె. సూర్య (S.j.surya) అదిరిపోయే పెర్ఫార్మన్స్ కు తోడు వివేక్ ఆత్రేయ (Vivek atreya) డైరెక్షన్ సినిమా కి మంచి ప్లస్ అయ్యాయి.
వీకెండ్ కుమ్మేసిన సరిపోదా శనివారం..
ఇక నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 11 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా, రెండో రోజు కాస్త డ్రాప్ అయినా, ఆ తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. ఇక శని, ఆది వారాల్లో వీకెండ్ కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది సినిమా. అయితే శని, ఆది వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడడంతో సినిమా కల్లెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అనుకున్నారు. కానీ అక్కడక్కడా తప్ప అన్ని చోట్ల మంచి హోల్డ్ చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా 4వ రోజు 8 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా సరిపోదా శనివారం నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 18.67 కోట్ల షేర్ సాధించగా, కర్ణాటక, తమిళనాడు సహా, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 4.75 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో కుమ్మేసిన ఈ సినిమా ఏకంగా 9.30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం.
వారంలో బ్రేక్ ఈవెన్ ఖాయం…
ఇక సరిపోదా శనివారం సినిమా వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల వీకెండ్ లో 32.72 కోట్ల షేర్ వసూలు చేయగా, 59.80 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆల్మోస్ట్ వీకెండ్ లోనే 80 % రికవరీ చేసేసిందని చెప్పాలి. ఇక 42 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 9.28 కోట్ల షేర్ అందుకుంటే సరిపోతుంది. చూస్తుంటే తొలివారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ అవడం ఖాయం అనిపిస్తుంది. ఇక సోమవారం వర్కింగ్ డే లోకి అడుగుపెడుతున్న సరిపోదా శనివారం, ఎంత వరకు హోల్డ్ చూపిస్తుందో చూడాలి. ఇక ఓవర్సీస్ లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా నెక్స్ట్ కర్ణాటక లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.