Saripodhaa Sanivaaram Collections : నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “సరిపోదా శనివారం” సినిమా ఆగష్టు 29న థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇతర భాషల్లో మినహా అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ సాధించింది. మరీ యానానిమస్ రేంజ్ లో లేకపాపోయినా, రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో చాలా బెస్ట్ అనిపించుకోవడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు కడుతున్నారు జనాలు. ముఖ్యంగా ఓవర్సీస్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన సరిపోదా శనివారం అక్కడ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా దూసుకుపోతుంది. ఇక ఫస్ట్ డే నాని (Nani) కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ సినిమా.
రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్..
సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 11 కోట్లకు పైగా షేర్ 20 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. నాని గత సినిమా దసరా 21 కోట్ల షేర్ అందుకుంటే, ఈ సినిమా తక్కువగా ఓపెనింగ్స్ రాబట్టి రెండో హైయెస్ట్ గా నిలిచింది. అయితే రెండో రోజు నుండి థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుంది ఈ సినిమా. ఇక రెండో రోజు సరిపోదా శనివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాం లో 1.70 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 3.04 కోట్లకి పైగా షేర్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా రెండో రోజు 5.3 కోట్ల షేర్ వసూలు చేసింది.
వీకెండ్ లో మరింత ఊపు..
సరిపోదా శనివారం సినిమా ఓపెనింగ్స్ డీసెంట్ గా తెచ్చుకున్నా, మంచి హోల్డ్ చూపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో సరిపోదా శనివారం దుమ్ము లేపుతుంది. ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం 16.72 కోట్ల షేర్, 30.70 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మరో 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈ వీకెండ్ లో శని, ఆదివారాల్లో మరింత వసూళ్ళలో మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇతర భాషల్లో సరిపోదా శనివారం ఆశించినంత రెస్పాన్స్ అందుకోవడం లేదని చెప్పాలి. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే అక్కడ కూడా మంచి వసూళ్లు అందుకునే అవకాశం ఉంది.