Dhanush : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ సినిమా ‘రాయన్’ థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతుంది. జులై 26న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన రాయన్ ఫస్ట్ డే మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఆ తర్వాత అదిరిపోయే మౌత్ టాక్ తో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో మొదటి సినిమాగా రాయన్ ను తెరకెక్కించగా, ఫస్ట్ సినిమాతోనే దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక రాయన్ సినిమా మొదటి వీకెండ్ లో ధనుష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించడమే కాకుండా, తన లాస్ట్ సినిమా కెప్టెన్ మిల్లర్ కలెక్షన్లను కూడా బ్రేక్ చేసింది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ తాజాగా అరుదైన రికార్డుని సాధించింది.
రాయన్ రికార్డ్ కలెక్షన్లు…
ఇక రాయన్ సినిమా వీకెండ్ లో 74 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయగా, తొలి వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100.20 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఇంతకు ముందు ధనుష్ నటించిన తిరు, సార్ సినిమాలు వంద కోట్లు రాబట్టగా. రాయన్ తో ధనుష్ వరుసగా మూడో సారి వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ఇక ఈ వారం కూడా థియేటర్ల వద్ద ఆశించిన సినిమాలేవీ థియేటర్ల వద్ద రాకపోగా, వచ్చిన చిన్న సినిమాలు కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ వారం కూడా రాయన్ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతుంది. ఇక లేటెస్ట్ గా రాయన్ పది రోజులు పూర్తి చేసుకోగా, రాయన్ అరుదైన రికార్డు సాధించింది.
కెరీర్ బెస్ట్ కొట్టేసిన ధనుష్…
ఇక ధనుష్ (Dhanush) నటించిన రాయన్ థియేటర్ల వద్ద అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేస్తుండగా, తాజాగా ధనుష్ నటించిన సినెమాలన్నిటిని క్రాస్ చేసింది రాయన్. వారం రోజుల్లో తిరు సినిమా రికార్డ్ బ్రేక్ చేయగా, పది రోజుల్లో “సార్” సినిమా వసూళ్లు కూడా బ్రేక్ చేసింది రాయన్. సార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 121 కోట్ల వసూళ్లు సాధించగా, ఇప్పుడు రాయన్ సినిమా కేవలం పది రోజుల్లో ఆ రికార్డులు బ్రేక్ చేసి ధనుష్ కెరీర్ లో రాయన్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. రాయన్ సినిమా విడుదలైన పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా 125 కోట్ల గ్రాస్ వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక తెలుగులో కూడా రాయన్ పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయిపోయి హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. లాంగ్ రన్ లో రాయన్ 150 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుందని చెప్పాలి.