Saripoda Sanivaram Collections : న్యాచురల్ స్టార్ నాని (Nani ) ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. హాయ్ నాన్న (Hai Nanna) సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం ( Saripoda Sanivaram) అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆగస్టు 29 న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఎలాంటి టాక్ ను అందుకుందో ఇప్పుడు అలాంటి టాక్ తోనే దూసుకుపోతుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. ఈ నేపథ్యంలో నాని ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు ఎంత రాబట్టిందో ఒక లుక్ వేద్దాం పదండీ..
హీరో నాని, వివేక్ ఆత్రేయ (Vivek Atreya) కాంబోలో వచ్చిన మూవీ సరిపోదా శనివారం’. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య (Sj Surya) విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. నిన్న విడుదలైన ఈ మూవీ కలెక్షన్ ను కూడా బాగానే రాబట్టిందని తెలుస్తుంది. ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే 700 లకు పై థియేటర్లలో ఆడింది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణాలో కలిపి రూ. 9 నుంచి రూ. 10 కోట్ల వరకు వసూల్ చేసినట్లు తెలుస్తుంది. అందులో రూ. 6 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొదటి రోజూ దసరా లో సగం కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 700+ షోలు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీకి ప్రీ రిలీజ్ భారీగానే జరిగింది. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ వ్యాపారం జరిగింది. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల హక్కులు 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 5 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా 41 కోట్ల మేర కలెక్షన్లు వసూలు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. అటు ఓవర్సీస్ లో చూస్తే.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 550K డాలర్లు వసూలు చేసింది. ఇక తొలి రోజు చివరి సమాచారం అందే సరికి 750K డాలర్లు వసూలు చేసింది.