Mathu Vadalara 2 Collections : ఏం ఏం సింహ (Sri Simha ) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మత్తు వదలరా 2… మత్తు వదలరా సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమా భారీగా వసూళ్లను సాధిస్తున్నది. సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రియాక్షన్‌తో దూసుకెళ్తున్నది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేస్తుంది. ఈ మూవీ రెండో రోజు కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీ సింహా కోడూరి, కమెడియన్స్ సత్య, సునిల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 13 న రిలీజ్ అయ్యింది.. భారీ బడ్జెట్‌తో రూపొందించారు. క్వాలిటీ కోసం ఎలాంటి రాజీ లేకుండా రిచ్‌గా సినిమాను అందించారనే విషయం ప్రతీ ఫ్రేమ్‌లోను స్పష్టమవుతుంది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు అన్ని కలిపి దాదాపు 16 కోట్లు బడ్జెట్ తో రూపొందించారు. మొదటి సినిమా పై ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ ను పెట్టినట్లు తెలుస్తుంది. ఇక సినిమాకు మొత్తంగా 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు క్రేజ్ ఎక్కువగా ఉండటంతో సుమారుగా 1000 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు.. ఇక మొదటి రోజే భారీ కలెక్షన్స్ ను రాబట్టి బాక్సాఫీస్ రికార్డ్ లను అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రియాక్షన్ లభిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 2.15 కోట్ల రూపాయలు నికరంగా, రెండో రోజు 3.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రెండు రోజుల్లో ఈ సినిమా 5.35 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేస్తున్నది.. ఇక రెండో రోజు కలెక్షన్స్ ను చూస్తే 9 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో చూస్తే నార్త్ లో ప్రీమియర్ల ద్వారా 137K,తొలి రోజు 166K కలెక్షన్లతో మొత్తంగా 302K డాలర్లను రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా 186 లోకేషన్లలో 200K డాలర్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..