Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ అనౌన్స్ అయిన దగ్గరి నుంచి మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ మొదటి భాగం సక్సెస్ కావడమే దీనికి కారణం. ఎక్కువ మోతాదులో వినోదం, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండవ భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా క్రియేటివ్ గా చేసి సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశారు. సెప్టెంబర్ 13 న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టింది.
మత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్
ఐదేళ్ల క్రితం దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ మత్తు వదలరా. ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా మత్తు వదలరా 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ సింహా. ఫరియా అబ్దుల్లా సీక్వెల్ లో హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో సత్య, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, కాల భైరవ సంగీతం అందించారు. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 మూవీకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి సపోర్ట్ కూడా లభించింది.
ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తాజాగా చిత్రబృందం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. సినిమా బడ్జెట్, స్కేల్ పరంగా మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే విశేషమే మరి. మేకర్స్ ఈ నంబర్లను యాక్షన్ ప్యాక్డ్ ఇంకా నవ్వించే పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. శ్రీ సింహ, సత్య మెషిన్ గన్లను కాల్చడం ఆ పోస్టర్లో చూడవచ్చు. వీరిద్దరూ మత్తు వదలరా 2 చిత్రంలో హి బృందంలో ఒక భాగం. సినిమాలో లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఆశించిన స్థాయిలో వర్కవుట్ కానప్పటికీ, ‘మత్తు వదలారా 2’లో ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదం ఉండడం ప్లస్ పాయింట్ అయ్యింది. సత్య షో ప్రారంభం నుండి చివరి వరకు అదరగొట్టాడు. ఈ వీకెండ్ లో మత్తు వదలరా 2 మూవీ మరిన్ని ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
మత్తు వదలరా 2 బిజినెస్
మత్తు వదలరా 2 మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. నైజాంలో 1.50 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలు, ఆంధ్రాలో 1.20 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 80 లక్షల బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4 కోట్ల మేరకు మత్తు వదలరా 2పైన వ్యాపారం జరిగింది. అంటే ఈ మూవీకి ప్రాఫిట్స్ రావాలంటే దాదాపు 5 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. మూవీ మత్తు వదలరా రేంజ్ లో లేకపోయినా సత్య కామెడీ కోసమైనా ఒకసారి చూడవచ్చు అనే టాక్ రావడంతో ఈ వీకెండ్ కలెక్షన్లతో నిర్మాతలకు మూవీ కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది.