Mathu Vadalara 2 Collections : ఈ మధ్య టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోగా, మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంటున్నాయి. అయితే సీక్వెల్ గా వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ టాక్ ను అందుకున్నాయి. అందులోనూ చిన్న సినిమాలు అయితే చెప్పనక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ రికార్డుల ను బ్రేక్ చేస్తున్నాయి. అలాంటి సినిమాల్లో మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) కూడా ఒకటి.. గతంలో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి మూడో రోజు కలెక్షన్స్ ఎంతనో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ డైరెక్టర్ రితేష్ రానా ( Rithesh Rana ) దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమాలో సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. 5 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ మన ముందుకు వచ్చింది . సెప్టెంబర్ 13న ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షోతోనే అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి. మొదటి రోజు కంటే రెండో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఇక వీకెండ్ కావడం తో మూడో రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయి.. ఇక ఆలస్యం ఎందుకు మూడు రోజులకు గాను ఎంత కలెక్షన్స్ రాబాట్టిందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..
మత్తు వదలరా 2′ సినిమా తొలి రోజు 5 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. రెండో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదు చేసింది. ‘మత్తు వదలరా 2’ శనివారం నాడు 5 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది.. అంటే రెండు రోజులకు కలిపి రూ. 11 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. రెండు రోజుల్లో ‘మత్తు వదలరా 2’ సినిమాకు రూ. 11 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని క్లాప్ ఎంటర్టైన్మెంట్, అలాగే సినిమా ప్రజెంటర్ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించాయి.. ఇక మూడు రోజులకు 5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. టోటల్ గా 16 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువగానే కలెక్షన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఓవర్సీస్ లో చూస్తే నార్త్ లో ప్రీమియర్ల ద్వారా 137K,తొలి రోజు 166K కలెక్షన్లు , మూడో రోజు 187k మొత్తంగా 323K డాలర్లను రాబట్టింది. ఈ సంతోషంలో సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించగా… ఫరియా అబ్దుల్లా, సునీల్, రోహిణి, ‘జబర్దస్త్’ రోహిణి తదితరులు నటించారు.