Haromhara – Maharaja : సుధీర్ బాబుకు దక్కని ఆదరణ.. అదే చోట డబ్బింగ్ సినిమాకి సూపర్ కలెక్షన్లు..

Haromhara – Maharaja : టాలీవుడ్ లో గత వారం రెండు క్రేజీ సినిమాలు విడుదలయ్యాన్న విషయం తెలిసిందే. అందులో సుధీర్ బాబు నటించిన హరోంహర సినిమా ఒకటి కాగా, మరొకటి విజయ్ సేతుపతి నటించిన డబ్బింగ్ సినిమా మహారాజ. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతో శుక్రవారం విడుదల అవగా, రెండు సినిమాలకి డీసెంట్ హిట్ టాక్ రావడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాలకు (Haromhara – Maharaja) జనాలు భిన్నంగా ఆదరిస్తున్నారు. ముందుగా తెలుగు సినిమా అయిన హరోంహర మంచి క్రేజ్ ఉన్న అంచనాలతో విడుదల అయింది. నెటిజన్లు కూడా ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే చూపిస్తుంది అనుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం వీకెండ్ లో సినిమా పెద్దగా గ్రోత్ ని అయితే చూపించ లేదు. కానీ ఇదే ప్లేస్ లో డబ్బింగ్ సినిమా మహారాజ మాత్రం ఇరగదీస్తోంది.

Haromhara - Maharaja movies weekend collections

మహారాజ వీకెండ్ కలెక్షన్స్..

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సుధీర్ బాబు నటించిన హరోంహర సినిమాకు మాత్రం ఆశించిన ఆదరణ దక్కడం లేదు. వీకెండ్ లో గ్రోత్ చూపిస్తుందనుకున్న ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. రెండో రోజున ఈ సినిమా 12 వేలకు పైగా టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకున్న సినిమా మూడో రోజుకి వచ్చే సరికి 11 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సండే రోజు కూడా గ్రోత్ ని చూపించలేకపోయింది. రెండో రోజు 54 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా, మూడో రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 78 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ లో 96 లక్షలు, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ సహా కలిపి మరో 28 లక్షలు మాత్రమే వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 2.02 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా 4.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే సినిమా మొత్తం మీద 6.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి.

- Advertisement -

అదరగొట్టిన మహారాజ వీకెండ్ కలెక్షన్స్…

ఇక తెలుగు సినిమా హరోంహర కి ఆదరణ దక్కకపోగా, అదే చోట డబ్బింగ్ సినిమా మహారాజా మాత్రంవసూళ్ళలో ఇరగదీస్తోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, కేవలం మౌత్ టాక్ తోనే భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఈ సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, మూడో రోజు కూడా 2 లక్షల 7 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రిమార్కబుల్ జోరుని చూపించిన సినిమా మూడో రోజు 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ వీకెండ్ లో మహారాజ సీనియా టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… నైజాం లో 1.42 కోట్లు, సీడెడ్ లో 48 లక్షలు, ఆంధ్ర లో 1.05 కోట్లు రాబట్టింది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 55 లక్షలు రాబడితే క్లీన్ హిట్ అవుతుంది. ఇక సోమవారం బక్రీద్ పండగ అడ్వాంటేజ్ తో క్లీన్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు