Harom Hara : హరోంహర ఫస్ట్ డే లెక్క.. కెరీర్ 2nd హైయెస్ట్..

Harom Hara : బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాలలో “హరోంహర” సినిమా ఒకటి. గత కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న “సుదీర్ బాబు” నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’ సినిమా మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ కాగా, మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక యాక్షన్ సీన్స్ కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ టైంలో సుదీర్ బాబు కెరీర్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంది. కానీ పోటిలో రిలీజ్ అయిన మహారాజ మూవీ నైట్ షోలకి కొంచం బెటర్ గా జోరు చూపించగా హరోంహర సినిమాకు కాస్త దెబ్బ పడగా, ఓవరాల్ గా అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని సాధించింది. కానీ మరీ అంచనాలను మించలేక పోయింది. ఇక మొదటి రోజు హరోంహర (Harom Hara) సినిమాకి బుక్ మై షో లో 14.4 వేల టికెట్ సేల్స్ జరిగాయి. ఆఫ్ లైన్ లో కూడా పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన సినిమా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే చేసింది.

Harom Hara movie 1st day collections

సుధీర్ బాబు కెరీర్ 2nd బెస్ట్…

ఇక హరోంహర సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోగా, వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా,1.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా, సుదీర్ బాబు కెరీర్ లో సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఇది వరకు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 1.3 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.40 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది హరోం హర మూవీ. ఇక ఈ సినిమా ఓవరాల్ గా వాల్యూ టార్గెట్ రేంజ్ 6.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 5.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకి ఎలాగూ టాక్ బాగానే ఉండటంతో లాంగ్ రన్ లో జోరు చూపిస్తే ఈ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.

- Advertisement -

లాంగ్ రన్ లో జోరు చూపిస్తుందా?

ఇక హరోం హర సినిమాను జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించగా, సుమంత్ నాయుడు నిర్మించడం జరిగింది. చైతన్య భరధ్వాజ్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే సునీల్, జయ ప్రకాశ్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక హరోంహర రెండో రోజు స్ట్రాంగ్ గా హోల్డ్ చూపించాల్సిన అవసరం ఉంది. మరి హరోంహర ఈ వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అలాగే హరోంహర సినిమా తో పాటు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుండడం తో గట్టి పోటీ నెలకొని ఉంది. అలాగే గత వారం విడుదలైన మనమే సినిమా కూడా డీసెంట్ హోల్డ్ ని చూపిస్తుంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు