GabbarSingh ReRelease Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ రిపీట్ చేసాడు పవర్ స్టార్. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ని రీ రిలీజ్ చేసారు మేకర్స్. నిర్మాత బండ్ల గణేష్ రెండేళ్ల నుండి ఈ సినిమా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున సెప్టెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమాకి అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. మామూలుగా ఈ సినీమాకి అంతగా రెస్పాన్స్ ఉండకపోవచ్చని చాలామంది భావించారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఈ జెనరేషన్ లో చూసిన సినిమా కాబట్టి, ఎక్కువగా చూడరని భావించారు. కానీ బుకింగ్స్ ఓపెన్ కావడం మొదలు రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ సేల్స్ తోనే రచ్చ చేసాడు గబ్బర్ సింగ్.
రీ రిలీజ్ లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్….
ఇక పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ప్రీ సేల్స్ తోనే పలు రికార్డులు క్రియేట్ చేసాడు. పది రోజుల కింద అన్నయ్య అన్నయ్య చిరు నెలకొల్పిన ఇంద్ర కలెక్షన్స్ ని అడ్వాన్స్ సేల్స్ తోనే బ్రేక్ చేసాడు తమ్ముడు పవన్. ఇక రిలీజ్ రోజయితే థియేటర్లలో మోత మోగిపోయింది. ఆన్లైన్ లోనే కాదు, ఆఫ్లైన్ బుకింగ్స్ లో అద్భుతమైన ఆదరణతో తొలిరోజు ఏకంగా అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది “గబ్బర్ సింగ్”. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 5.28 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ అందుకోగా, ఇండియాలో 6.21 కోట్ల గ్రాస్ అందుకుంది సమాచారం.
వరదల్లో కూడా రికార్డ్ బ్రేకింగ్..
ఇక గబ్బర్ సింగ్ (GabbarSingh ReRelease Collections) సినిమా వరల్డ్ వైడ్ గా తొలిరోజు 8.02 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. మొత్తంగా మురారి రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి సాలిడ్ రికార్డ్ సెట్ చేసిన గబ్బర్ సింగ్ రెండో రోజు వసూళ్లతో మురారి ఫైనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి కొత్త ట్రెండ్ మళ్ళీ సెట్ చేస్తాడేమో చూడాలి. అయితే గబ్బర్ సింగ్ రిలీజ్ రోజు తెలుగు రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించినా మేజర్ ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. అక్కడక్కడా ఏరియాల్లో తగ్గాయి తప్పా, వర్షాల ప్రభావం పెద్దగా ఫ్యాన్స్ పట్టించుకోలేదని చెప్పాలి. మరి ఈ సినిమా ఫైనల్ వసూళ్లు ఎంత ఉంటాయో చూడాలి.