Raayan : కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ సినిమా ‘రాయన్’ థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతుంది. జులై 26న థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన రాయన్ ఫస్ట్ డే మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, ఆ తర్వాత అదిరిపోయే మౌత్ టాక్ తో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో మొదటి సినిమాగా రాయన్ ను తెరకెక్కించగా, ఫస్ట్ సినిమాతోనే దర్శకుడిగానూ మంచి మార్కులు కొట్టేసాడు. ఇక రాయన్ ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ అయి బ్లాక్ బస్టర్ అయింది. ధనుష్ కెరీర్ లో వంద కోట్లు వసూలు చేసిన మూడో సినిమాగా రాయన్ నిలిచింది.
కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా రాయన్…
ఇక రాయన్ సినిమా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ని రాబట్టి అదరగొట్టింది. రెండో వారంలో కూడా సత్తా చాటిన రాయన్ సినిమా ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన “సార్” సినిమాని కూడా బ్రేక్ చేసి రాయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 122 కోట్ల వసూళ్లు సాధించగా, ధనుష్ రాయన్ దాన్ని పదిరోజుల్లోనే బ్రేక్ చేసింది. విడుదలై రెండు వారాలు దాటినా ఇప్పటికీ పలు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ, స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇక తాజాగా రాయన్ మరో అరుదైన రికార్డ్ ని సాధించింది.
రాయన్ అరుదైన రికార్డ్…
ఇక ధనుష్ నటించిన రాయన్ (Raayan) సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సం క్రియేట్ చేయగా, రాయన్ సినిమా లేటెస్ట్ గా 150 కోట్ల మార్క్ ని అందుకుంది. ధనుష్ కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన తొలి సినిమాగా రాయన్ నిలవగా, విడుదలైన 18 రోజుల్లో ఈ రికార్డ్ సాధించడం విశేషం. ఇక ఇప్పటికీ స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. లాంగ్ రన్ లో మరో పది కోట్ల వరకు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం పంద్రాగస్టు కి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రాయన్ సినిమా థియేటర్లు తగ్గే ఛాన్స్ ఉంది.