3 Three Movie Collections : టాలీవుడ్ లో కొన్నాళ్లుగా డల్ అయిన రీ రిలీజ్ సినిమాల హంగామా మురారి సినిమాతో మళ్ళీ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఇంద్ర, గబ్బర్ సింగ్ సినిమాలు కూడా భారీ కలెక్షన్లు వసూలు చేసి, రీ రిలీజ్ లో కూడా అదుర్స్ అనిపించుకున్నాయి. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన అండర్రేటెడ్ క్లాసిక్ లవ్ స్టోరీ “3” (త్రి) సినిమా రీ రిలీజ్ అవుతుందని వార్తలు రాగా, ఫైనల్ గా సెప్టెంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ అయింది ధనుష్ 3 సినిమా (3 Three Movie). అయితే మేకర్స్ ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోగా, సైలెంట్ గా రీ రీలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అప్పుడు థియేటర్లలో డిజాస్టర్ చేసిన మూవీ లవర్స్ రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ చేసారు.
అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్…
ఇక ధనుష్ (Dhanush) నటించిన సినిమాల్లో డిజాస్టర్ అయినా అండర్రేటెడ్ క్లాసిక్ గా నిలిచింది 3 సినిమా. ధనుష్, శృతి హాసన్ (Shruthi hasan) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ధనుష్ భార్య ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా 2012 లో విడుదలై డిజాస్టర్ అవగా, నిన్న సెప్టెంబర్ 14న మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అప్పట్లో సంచలనం రేపిన వై దిస్ కొలవరి సాంగ్ కూడా ఈ సినిమాలోనే ఉంటుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే.. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 1.48 కోట్ల గ్రాస్ ఉండగా, అందులో కేవలం హైదరాబాద్ సిటీ లోనే 55 లక్షలు గ్రాస్ ఉండడం విశేషం.
అండర్రేటెడ్ క్లాసిక్ భీభత్సం..
ఇక 3 సినిమా అప్పుడు డిజాస్టర్ అయినా, ఇప్పుడు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆ మధ్య తెలుగులో రామ్ చరణ్(Ramcharan) నటించిన ఆరెంజ్(Orange) సినిమా అప్పట్లో డిజాస్టర్ అయినా, తర్వాత అండర్రేటెడ్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు 3 సినిమా కూడా అలాగే మంచి ప్రేక్షకాదరణ దక్కించుకోవడం విశేషం… ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే… ఈ ఇయర్ కెప్టెన్ మిల్లర్ తో యావరేజ్ సినిమా అందుకున్నా, రాయన్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక త్వరలో కుబేర సినిమాతో కూడా ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.