Bigg Boss : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో బిగ్ బాస్.. ప్రతి ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ ప్రసారం అవుతుంది. తెలుగు, తమిళ్, బాలీవుడ్ షోలకు ప్రజాధారణ కాస్త ఎక్కువ. అయితే ఆ షోలకు హోస్టులు గా చేస్తున్న హీరోల వల్లే షో మంచి హిట్ ను అందుకుంటున్నాయి.. ముందుగా ఫారెన్ కంట్రీస్‌లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్.. తెలుగులో హోస్ట్ లు మారారు. కానీ తమిళ్ లో మాత్రం మొదటి నుంచి కమల్ హాసన్ ( Kamal Haasan ) హోస్టుగా వ్యవహారిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఈ షో నుంచి తప్పుకున్నారు. ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు కూడా.. తాజాగా ఈ షో హోస్ట్ పై మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కమల్ తన హోస్టింగ్ తో తమిళ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. మిగిలిన అన్ని భాషల్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారింది. కానీ తమిళ్ బిగ్ బాస్ లో మాత్రమే రూమర్స్ పెద్దగా వినిపించలేదు. అయితే కమల్ ఈ షో పై ఫోకస్ పెట్టలేక పోవడంతోనే ఈ సారి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రెస్ విడుదల చేసిన చేసిన నోట్ లో క్లియర్ గా రాశారు.. కమల్ వెళ్ళాక ఆ షోకు ఎవరు హోస్ట్ గా ఉంటారనే ప్రశ్న మొదలైంది. కమల్ తప్పుకున్న తర్వాత ఎవరు హోస్ట్ అంటూ రకరకాల వార్తలు వినిపించాయి.
కమల్ తప్పుకోవడంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈయన స్థానంలోకి మరో స్టార్ హీరో శింబు ( Shimbu) రాబోతున్నట్లు గతంలో చాలా వార్తలు తమిళ మీడియాలో ప్రచారం అయ్యాయి. కమల్‌తో పోలిస్తే శింబుకు హోస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది.. అయితే ఇప్పుడు హోస్ట్ ఎవరనే దానిపై ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సారి ప్రసారం కాబోతున్న సీజన్ 8 కు హోస్టుగా విలన్ గా మెప్పిస్తున్న విజయ్ సేతుపతి ( Vijay sethupathi ) ని తమిళ బిగ్ బాస్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఆయనతో ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో ట్రెండ్ అవుతుంది. మరి ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి..