Bigg Bos 8 Telugu : బిగ్ బాస్ లో గతంలో లాగా కాకుండా కొత్తగా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అలా అనుకున్నదే అన్ లిమిటెడ్ ఫన్స్ అన్నట్లు గానే గేమ్స్ డిజైన్ చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో టాస్క్ లను తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ సోర్టీలు, రొమాంటిక్ మూమెంట్స్ తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క( Bebakka ) ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్లే ఉన్నారు. ఈ వైల్ కార్డు ఎంట్రీ ద్వారా హాట్ బ్యూటిని హౌస్ లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.. ఆమె ఎవరో ఒక లుక్ వేద్దాం పదండీ..
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బుల్లితెర సీరియర్ నటిగా తెలుగు ప్రజల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి జ్యోతిరాయ్ ( జ్యోతిరాయ్ ). ఈ పేరుతో పిలిస్తే ఎవరు పెద్దగా కనుక్కోలేరు. కానీ జగతి మేడం అంటే బాగా కనుక్కుంటారు. బుల్లి తెర పై సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జ్యోతిరాయ్‌కు మంచి గుర్తింపు దక్కింది. సీరియల్‌లో తల్లి పాత్రలో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించినప్పుడు, బయట మాత్రం హాట్ అందాలతో పిచ్చెక్కుతుంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో, బుల్లి తెరపై సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఈమె కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించింది. తర్వాత కన్నడ టీవీ సీరియల్ నటిగా పాపులర్ అయ్యింది. దీనితో తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్‌లో అవకాశం కొట్టేసింది. అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇంకా జగతి మేడమ్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇక యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో మునిగి తేలుతుందని సోషల్ మీడియా లో టాక్. అలాగే ఆయన్ను వివాహం కూడా చేసుకున్నారని జనాలు చర్చించుకున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ వీరిద్దరు టెంపుల్స్, వెకేషన్స్‌కు వెళ్లినా పిక్స్ నెట్టింట షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇక కెరీర్ విషయానికొస్తే.. సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా చేస్తూనే ఉంది..
లేకపోతే తెలుగు బిగ్ బాస్ సీజన్-8 లో కి ఈ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందట. మొన్నటిదాకా రీతూ చౌదరి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపించింది. ఇప్పుడు జ్యోతిరాయ్ నేమ్ వినిపిస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే ఇక హౌస్ లో రచ్చ మాములుగా ఉండదు. ఏమౌతుందో, ఇక ఈమెతో ఎలా ఉండబోతుందో చూడాలి..