Bigg Boss Telugu 8: నా బూతో నా భవిష్యత్.. బిగ్ బాస్ హౌస్ 8 ( Bigg Boss Telugu 8 ) లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పై జనాల స్పందన ఇదే.. అసలేం జరుగుతుందో తెలియలేక జుట్లు పీక్కుంటున్నారు. మొన్నటి వరకు స్లో గా ఉందని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది రా అనుకుంటున్నారు. ఓకే టీవీ లో రెండు బూతు బొమ్మలు చూపిస్తున్నారు. హౌస్ లో గొడవలు జరుతున్నాయి. ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో హౌస్ లో గొడవలు జరుగుతున్నాయి. నిఖిల్ (Nikhil ), సోనియా (Sonia) మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్టు గత వారం అంత చూయించారు. అదే విషయాన్నీ సోనియాను విష్ణు ప్రియ అడిగితే అడల్ట్రేట్ జోక్స్ వెయ్యద్దంటూ పెద్ద రచ్చ చేసింది. అలాంటి సోనియా నిన్న లైవ్ లో మాట్లాడుతూ ఆమెకు నిఖిల్ కు మధ్య ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. తనకు ఇంట్లోనూ అన్న ఉన్నారని వాళ్ళు ఆమెకు వంట చేసి పెట్టేవాళ్ళు అని పెద్దోడు నిఖిల్ అని చిన్నోడు పృథ్వీ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.. ఆ మాటలు విన్న ఆ ఇద్దరికీ ఫ్యూజులు అవుట్ అయ్యాయి.
ఇక వ్యాక్స్ టాస్క్ లో పృథ్వి, నిఖిల్, నబీల్ (Nabeel ) పాల్గొన్నారు. అందులో పృథ్వి నా వల్ల కాదు అని మధ్యలోనే లేచిపోయాడు. ఇక నిఖిల్ కష్టపడ్డా కాళ్లకు వ్యాక్స్ చేసుకున్నప్పటికీ నబీల్ ఫాస్ట్ గా వ్యాక్స్ చేసుకోవడంతో నబీల్ గెలిచారు. నిజానికి వ్యాక్స్ చెస్ట్ పై చేసుకున్నది నబీల్ ఒక్కటే.. దాంతో నబీల్ ఈ టాస్క్ లో గెలిచారు. అయితే నిఖిల్ కళ్ళకు వ్యాక్స్ చేసుకోవడంతో అవి మంటలు ఎక్కువగా ఉండడంతో నిఖిల్ కాళ్ళను రుద్దుతూ మసాజ్ చేసింది సోనియా. దాంతో బిగ్ బాస్ ప్రేక్షకులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ దృశ్యాన్ని సడెన్ గా చూసి ఇంకేదో మసాజ్ చేస్తుందేమో అని ప్రేక్షకులు భ్రమ పడేలా ఉంది. అయితే ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ గురించి ఫ్యాన్స్ కూడా తెగ ఫీల్ అవుతున్నారు.
ఇకపోతే మరోవైపు పృథ్వి తో పులిహోర కలుపుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అర్ధరాత్రి పృథ్వి కిచెన్ లో రొమాన్స్ చేసినట్లు తెలుస్తుంది. పేరుకేమో అన్న అంటూనే గబ్బు పనులు చేస్తుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గురువారం ఎపిసోడ్ లో వ్యాక్స్ చేసుకొని కాళ్లు నొప్పులు ఉన్నాయని సోనియా నిఖిల్ కు కాళ్లు నొక్కుతూ కనిపించింది. ఆ వీడియో చూడటానికి అసభ్యంగా ఉంది. అలాగే అర్ధ రాత్రి కిచెన్ లో ఉన్న సోనియాను పృథ్వి హగ్ చేసుకున్నాడు. ఒక సందర్బంలో పృథ్వి తొడల పై చేతులు వేస్తూ కనిపించింది సోనియా. ఈ ఫోటోల పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లేదని అనుకున్నారు. కానీ డబుల్ ట్రాక్ మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టాస్క్ లు ఆడి ఫుడ్ ను గెలుచుకోవాలి అనే టాస్క్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. నామినేషన్స్ ఈ వారం బాగానే జరిగాయి. వాళ్ళలోంచి ఎవరు బయటకు పోతారో చూడాలి.