Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగింది. సండే ఫన్ డే తర్వాత ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరిగాయి. ఒక్కో హౌస్ మెట్స్ నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. అయితే, ఈ ఎపిసోడ్‍లో సోనియా (Sonia), నిఖిల్ ( Nikhil), పృథ్విరాజ్ ( Pruthvi) మధ్య ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుందనేలా ప్రోమోను, ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు. గత వారం జరిగిన నామినేషన్ గుర్తు పెట్టుకొని ఈ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే ఎలిమినేషన్ ఏమో గానీ లవ్ ట్రాక్ లు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొందరు సేఫ్ గేమ్ ఆడటం మాత్రమే కాదు లవ్ ట్రాక్ గురించి బయట పెడుతున్నారు. ఇప్పటికే జంటలు అదే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సోనియా, నిఖిల్ కు ఓపెన్ ఆఫర్ ను ఇచ్చేసింది. దాని వీడియో వైరల్ అవ్వడంతో ట్రెండ్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే.. బేబక్క ( Bebakka) వెళ్లిన తర్వాత గేమ్ పై హౌస్ మెట్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోసోనియా చీఫ్ అవుతారని, బిగ్గెస్ట్ క్లాన్, లగ్జరీకి కూడా సోనియా వస్తుందని విష్ణుతో నైనిక అన్నారు. తమ చీఫ్ వేరే గ్రేట్ చీఫ్‍ను అనడంపై ఆదిత్య ఓం ( Adithya om) అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను భజన మండలిలో ఉండడానికి తాను రాలేదని సీతతో అన్నారు. హౌస్‍లో తెలిసీ తెలియక టీమ్‍లు ఏర్పడ్డాయని నాగ మణికంఠ, నబీల్ ఆఫ్రిది మాట్లాడుకున్నారు. హౌస్‍మేట్స్ ఎవరూ ఏం కారని మణికంఠతో యష్మి చెప్పారు. అందరూ కంటెస్టెంట్లే అని, ఒకరి మాటే వినాలంటే అది బిగ్‍బాస్ అంటూ అతడికి సలహాలు ఇచ్చారు. ఇక విష్ణు ప్రియ పృథ్విని లైన్లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా ఆ లిస్ట్ లోకి సోనియా కూడా చేరింది.
ఇక సిగరెట్ తాగకుండా ఉంటే ఏది అడిగినా ఇస్తానని నిఖిల్‍తో సోనియా అన్నారు. ఒక్కసారిగా ఇలా అనటంతో నిఖిల్ అవాక్కయ్యారు. “నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా.. నువ్వు ఏమడిగినా ఇస్తా” అని సోనియా అన్నారు. దీంతో బాటిల్‍తో నీళ్లు తాగుతున్న నిఖిల్ ఒక్కసారిగా ఆ అంటూ ఆశ్చర్యపోయారు. వీరిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందనేలా ప్రోమోలో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ వేసింది స్టార్ మా ఛానెల్. సోనియా సిగ్గుపడిపోగా.. మీసాలు మెలేశారు నిఖిల్. అందుకే ‘గాడ్ మస్ట్ బీ క్రేజీ’ అంటారని అభయ్ నవీన్ డైలాగ్ వదిలారు. తనకు సంతోషంగా ఉందని, ఎవరో ఒకరికి తోడు దొరికిందనేలా కిర్రాక్ సీత అన్నారు. కళ్ల ముందు చూసేదంతా నిజం కాదంటూ అభయ్ మరో కామెంట్ చేశారు. మొత్తానికి హౌస్ మెట్స్ మధ్య ప్రేమ చిగురించేస్తుందని తెలుస్తుంది.. ఎవరి మధ్య ప్రేమ పుడుతుందో.. ఎవరిని బిగ్ బాస్ విడగొడుతుందో చూడాలి.. ఏది ఏమైనా రెండో వారం నామినేషన్ ప్రక్రియ కాస్త రసవత్తరంగా సాగింది..