Bigg Boss 8 Telugu Promo : బాస్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది. రెండో వారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఈ వారం అందరు స్ట్రాంగ్ గా ఉండేవారే. కానీ ఎవరో ఒకరు హౌస్ నుంచి వీడక తప్పదు. ఈ వారంకు గాను శేఖర్ బాషా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని నిన్నటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన హౌస్ నుంచి వెళ్లడమే కాదు.. మంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ విడుదల చేసింది. ఆ ప్రోమో హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
బిగ్ బాస్ రెండో వారం ఈరోజుతో ఎండ్ అవుతుంది. అందులో భాగంగానే నాగార్జున కంటెస్టెంట్స్ తో ఫుల్ కామెడీ చేయిస్తూ ఆకట్టుకున్నారు. ఇకపోతే నిన్నటి వరకు హౌస్ లో నైనిక, యష్మి, నిఖిల్ అంటూ ముగ్గురు చీఫ్స్ ఉండగా.. యష్మీ , నైనిక చీఫ్స్ గా ఫెయిల్ అవ్వడంతో వీరిద్దరి స్థానంలో అభయ్ నవీన్ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఇక నిఖిల్ , అభయ్ క్లాన్స్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారో? చెప్పి మరీ డిసైడ్ చేసుకోమని , గ్రూపులుగా డివైడ్ అవ్వాలని తెలిపారు. అందులో కొందరు గ్రూపులు మారారు.. అయితే ఈ ప్రోమో కాస్త ఆసక్తిగా మారింది. ఈ టాస్క్ లో భాగంగా చిత్రం.. విచిత్రం అంటూ టాస్క్ ను ఇచ్చారు నాగ్.. అది కొత్తగా ఉందని తెలుస్తుంది.
రెండు బొమ్మలని చూపించి ఆ రెండు బొమ్మలు కలిపితే ఏ పదం వస్తుందో చెప్పాలి అని చెబుతాడు నాగార్జున. దాంట్లో మొదట ఆపిల్, ఎండు మిర్చి ను చూపిస్తాడు నాగార్జున. దీనికి శేఖర్ బాషా మిరపల్ అంటూ సంబంధంలేని పదం చెప్పి నవ్వులు పూయిస్తాడు.ఇక తర్వాత బ్యాటరీ, ల్యాండ్ లైన్ ఫోన్ బొమ్మలను ప్రజెంట్ చేయగా.. సీత సెల్ఫోన్ అంటూ తెలిపింది. అయితే ఎవరో తనకు హెల్ప్ చేస్తున్నారు అంటూ నాగార్జున తెలిపారు. ఎవరు చేయలేదు నేనే తెలిపాను అని సీత చెబితే, కాదు విష్ణు చెప్పింది అని చెబుతాడు. దాంతో విష్ణు ప్రియ చటుక్కున లేచి.. సార్ నాకే అంత తెలివి ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని అంటూ అందరినీ నవ్వించింది..
ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో సోనియా తో నిఖిల్, పృథ్వి గురించి అడిగాడు నాగ్. వారం మొత్తం ఉన్న బొక్కలను బయట పెట్టాడు. అయితే ప్రేరణ అభయ్ టీమ్ కు వెళ్లింది. ఆ తర్వాత పృథ్వి నిఖిల్ టీమ్ కు వెళ్లాడు. ఇలా ఒక్కొక్కరు తమ చీప్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక చివరగా ఎలిమినేషన్ గురించి చెప్పాడు నాగ్. మరి ఎవరు వెళ్తారో కాసేపటిలో తెలిసిపోతుంది. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఎవరు వెళ్తారో..