Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సీజన్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. రెండో వారం మొదటి నుంచి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లకు ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. రెండు రోజులుగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు కొత్తగా ఉండటం మాత్రమే కాదు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం హౌస్ లో సేఫ్ జోన్ లో యష్మీ( Yashmi Gowda) మాత్రమే ఉంది. మిగిలిన అందరు నామినేషన్ లో ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో గొడవలు జరగలేదు కానీ ఒక్కొక్కరికి వాచి పోయింది.. ఇక మరో జంట మధ్య లవ్ ట్రాక్ మొదలు అయ్యింది. నిన్నటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
బిగ్ బాస్ హౌజ్ అంతా దాదాపుగా యష్మీ చేతిలోకి వెళ్లిపోయింది. సంచాలక్ గా తాను చెప్పిందే వేదం అయ్యింది. ఇక బిగ్ బాస్ ఆమెకు ఫుల్ పవర్స్ ను బిగ్ బాస్ ఇచ్చేశాడు. రెండు టీమ్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా నిఖిల్ టీమ్‌లో స్థానం దక్కించుకున్నందుకు నాగ మణికంఠకు ( Manikanta) దారుణంగా అన్యాయం జరుగుతుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. తన టీమ్‌లో నిఖిల్, మణికంఠ మాత్రమే ఉన్నా వారు కూడా ప్రతీ టాస్కులో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో నైనికా టీమ్‌కు చెందిన నబీల్ కూడా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది.. హౌస్ లో ఏదైన తినాలి అంటే ముందుగా గెలుచుకొనే తినాలి. లేదంటే ఆకలితో చావాలి అన్నట్లు టాస్క్ లు ఉన్నాయి..
నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ ఒక్కడే ఉన్నాడు. ఇద్దరు ఆడి గెలిస్తే తప్ప ఫుడ్ దొరకదు. ఎలాగో గెలిచి రాగి జావాను గెలుచుకున్నారు. ఇతర టీమ్స్ కడుపునిండా భోజనం చేయడం, జ్యూస్‌లు తాగడం చూసి మణికంఠ ఫీలయ్యాడు. అంతే కాకుండా ఇద్దరే టాస్కులు ఆడాల్సి రావడంతో మణికంఠ, నిఖిల్ బాగా అలసిపోయారు కూడా. దీంతో తిండి కోసం మణికంఠ బిగ్ బాస్ ఆదేశాలను పక్కన పెట్టక తప్పలేదు. అతను ఆకలికి అస్సలు ఉండలేడు. ఇక చేసేదేమి లేక ఫుడ్ ను దొంగలించే ప్రయత్నాలు చేస్తున్నాడు..
రాత్రి అందరూ పడుకున్న తర్వాత మణికంఠ వెళ్లి దోశలు వేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ కొందరు హౌజ్‌మేట్స్ ఉన్నా కూడా తనను చూసి జాలిపడి ఎవరూ ఏమీ అనలేదు. సైలెంట్‌గా చీకట్లోకి వెళ్లి దోశలు తింటున్న సమయంలో అక్కడికి నిఖిల్ వచ్చాడు. అలా ఇద్దరు కలిసి దోశలు తిని కడుపునింపుకున్నారు. ప్రైజ్ మనీలో రూ.50 వేలు దక్కాలంటే పృథ్విరాజ్, నిఖిల్, నబీల్ కాళ్లపై, ఛాతిపై వ్యాక్సింగ్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. వెంట్రుకలు తీస్తున్నప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక పృథ్వి తప్పుకున్నాడు. ఎంత నొప్పి వచ్చినా తట్టుకొని నబీల్ టాస్క్ విన్ అయ్యాడు. వ్యాక్సింగ్ వల్ల తన ఛాతి అంతా ఎర్రగా అయిపోయింది. దీంతో టాస్క్‌లో తను పడిన కష్టం చూసి సీత ఇంప్రెస్ అయ్యి ముద్దు పెట్టింది. ఇది ఎపిసోడ్ కు హైలెట్ అయ్యింది.. మొత్తానికి చూసుకుంటే ఫుడ్ పేరుతో బిగ్ బాస్ బాగానే లాక్ చేశాడు. తిండి కోసం హౌస్ మెట్స్ మధ్య చిచ్చు పెట్టింది. బిగ్ బాస్.. ఇక నెక్స్ట్ ఎలాంటి టాస్క్ లు ఇస్తారో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.