Bigg Boss 8 Telugu : తెలుగు బిగ్ బాస్ ఎనిమిదోవ సీజన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సీజన్ మొదలై రెండు వారాలు పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారం ఎవరు బయటకు వెళ్తారా? అని జనాల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రతి వీకెండ్ నాగార్జున వచ్చి హౌస్ లో కాస్త కలరింగ్ వచ్చేలా ఆట పాటలతో అలరిస్తాడు. అనంతరం ఒక్కో హౌస్ మేట్ కు క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత కొత్త టాస్క్ ను ఇస్తాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో నాగ్ వచ్చి ఎలిమినేట్ అయిన వారిని అనౌన్స్ చేస్తాడు. ఇక ఈ వారం కూడా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అదిరిపోయే డ్యాన్స్ వేసి ఎంట్రీ ఇచ్చాడు. ఇక విషయానికొస్తే ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అనేది చూద్దాం..
ఇక రెండో వారం నాగమణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందు సేవ్ అవుతారనడంలో డౌటే లేదు. రోజురోజుకీ ఆట మెరుగుపర్చుకుంటున్న మణికంఠకూ బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి.. రోజు రోజుకు తన ఫైర్ ను చూపిస్తూ కసితో డ్యాన్స్ చేస్తూ, టాస్క్ లను చేస్తూ వస్తుంది. ఇకపోతే నామినేషన్ లో ఎవరు ఉన్నారో ఒకసారి చూసేద్దాం..
ఈ ముగ్గురు కాకుండా ఆదిత్య, సీత, శేఖర్ బాషా, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్‌లో రఫ్ఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ.. గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి.. ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్లు అలాగే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరగా హౌస్ లో మిగిలింది. శేఖర్ భాషా, ఆదిత్య.. వీరిద్దరిలో ఆదిత్య కొంచెం మెరుగైయ్యాడు. టాస్క్ లలో చురుగ్గా ఉంటూ పాల్గొంటున్నాడు. కెమెరాల ముందు నేనున్నానని చెబుతాడు.. ఇక ఒకే ఒక్కడు శేఖర్ భాషా (Sekar Bhasha )..
తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్‌బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య.. హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు. ఇక ఆదిత్యను నాగ్ యాక్టివ్ గా ఉండమని చెప్పాక అన్ని టాస్క్ లు బాగానే చేస్తున్నాడు. ఇక భాషా అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి బాషాను ఎలిమినేట్ చేశారట.. అతను ప్రస్తుతం సీక్రెట్ రూమ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక రేపు ఆయనను అఫిషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు.. ఇకపోతే వైల్డ్ కార్డు ద్వారా రోహిణి లేదా అవినాష్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందని టాక్.. ఎమౌంతుందో తెలియాలంటే రేపు వరకు వెయిట్ చెయ్యాల్సిందే…