Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ ప్రస్తుతం ఆసక్తిగా మారుతుంది. మొదటి నామినేషన్ తర్వాత హౌస్ మెట్స్ లో జోష్ పెరిగింది. ఎలాగైనా విన్నర్ అవ్వాలనే కసితో నువ్వా నేనా అంటూ పోటి పడుతున్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లోని వారంతా తెలిసిన వాళ్లే. కొందరు సీరియల్స్ తో అలరిస్తే, మరికొందరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి క్రేజ్ ను అందుకున్నారు. అందులో యూట్యూబర్ కిర్రాక్ సీత (Kirrak Seetha ) కూడా ఒకటి. రాయలసీమకు చెందిన సీత యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించింది. బోల్డ్ వీడియోలు చేస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టీవీ షోలు, సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది.. ఈమె సినిమాలు మాత్రమే కాదు హార్ట్ టచింగ్ బ్రేకప్ స్టోరీ కూడా ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
సీత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ( Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vishnavi Chaithanya ) జంటగా నటించిన బేబీ సినిమా తో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమాలో హీరోయిన్ గా బోల్డ్ పాత్రలో నటించి యూత్ మనసు కొల్ల గొట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాపకు క్రేజ్ కూడా పెరిగింది. వరుస సినిమా ఆఫర్స్ తలుపు తడుతున్నా కూడా మరోవైపు సోషల్ మీడియా, యూట్యూబ్ లో వీడియోల ను చేస్తూ ట్రెండ్ అవుతుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సీత ఒకటిగా కనిపిస్తోంది. ఇకపోతే బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీత తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పింది. అందుకు సంబందించిన వీడియో కూడా అప్పటిలో బాగా వైరల్ అయ్యింది.
తాను ఇష్టంగా చేసిన ఏ పనైనా తనతో ఎప్పుడూ ఉందని చెప్పింది. అలాగే తాను ఒక అబ్బాయిని ఘాడంగా ప్రేమించిన విషయాన్ని బయట పెట్టింది. ఈమె దాదాపుగా ఐదేళ్లు పాటు అతనిని సిన్సియర్ గా లవ్ చేసిన విషయాన్ని బయట పెట్టింది. లవ్ చేసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఆమె కల నెరవేరలేదు. సీతను సదరు అబ్బాయి పేరెంట్స్ కోడలిగా యాక్సెప్ట్ చేయలేదు. ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యమని భావించిన సీత అతన్ని వదిలేసింది. తన గుండెను ముక్కలు చేసుకుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా తనతో మాట్లాడలేదు.. ఆ నరకం నుంచి బయట పడింది. కానీ జ్ఞాపకాలను మర్చిపోలేదని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ఇక హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఈమె కూడా ఒకటి.. చివరి వరకు హౌస్ లో కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి..